దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. గతేడాది దీనిని టాటా గ్రూప్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల బోయింగ్, ఎయిర్‌బస్‌ల నుంచి 470 విమానాలను కొనుగోలు చేసేందుకు ఎయిర్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో.. ఈ సంఖ్యలో విమానాలను నడపడానికి చాలా మంది అవసరం. అందుకోసం ఎయిర్ ఇండియా రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఎయిర్‌లైన్‌లో ప్రస్తుతం 140 విమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో అత్యాధునిక విమానాలను నడిపించే పైలట్లకు ఏకంగా ఏడాదికి రూ.2 కోట్ల వరకు ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు బిజినెస్ టుడే పేర్కొంది. బోయింగ్ బీ777 క్యాప్టెన్ కోసం రూ.2 కోట్లు వెచ్చించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
ఎయిర్‌లైన్ యొక్క ప్రకటన ఇలా ఉంది.. 'B737 NG/MAX రేటెడ్ పైలట్‌ల నుండి B777 ఫ్లీట్ కోసం ఫస్ట్ ఆఫీసర్‌లకు దరఖాస్తులు ఆహ్వానింస్తున్నామని.. ఈ పైలట్‌లకు నెలకు $21,000 చెల్లించబడుతుందని అన్నారు. అంటే ఇది భారతీయ కరెన్సీలో మొత్తం రూ.17,39,118 వరకు ఉంది. సంవత్సరానికి లెక్కిస్తే, మొత్తం 2,08,69,416 ఉంటుంది. B737 NG/MAX విమానాన్ని నడిపే సామర్థ్యం ఉన్న పైలట్ల సంఖ్య తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ కొరత వల్లనే ఆ ఉద్యోగానికి ఎక్కువ శాలరీ ఆఫర్ చేస్తున్నారు. దరఖాస్తులకు ఇక్కడ క్లిక్ చేయండి.
పైలట్లతో పాటు.. ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ మరియు ఇతర సాంకేతిక ఉద్యోగాలను నియమిస్తోంది. ఆ ఉద్యోగాలన్నీ ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌లో ప్రకటించబడ్డాయి. 470 ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసేందుకు ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకోవడంతో భారత విమానయాన రంగంలో 2 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు లభిస్తాయని బిజినెస్ టుడే గతంలో నివేదించింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా వెబ్ సైట్‌లో కొత్త నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుండడం ఆ ట్రెండ్‌కి నాందిగా తెలుస్తోంది.
ఎయిర్ ఇండియా మాజీ అధికారి జితేంద్ర భార్గవ మాట్లాడుతూ.. ప్రతి విమానానికి కనీసం 10 మంది పైలట్లు అవసరం.. వారు కూడా షిఫ్ట్‌ల వారీగా పని చేయాల్సి ఉంటుంది కనుకు 10 మంది అవసరం ఉంటుందన్నారు. ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్స్‌లో 5000 నుంచి 7000 గంటల పాటు ప్రయాణించ గల సామర్థ్యం ఉన్న పైలట్లు ప్రస్తుతం భారీగా డిమాండ్ ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పైలట్ల కొరత వేదిస్తోందని, అందుకే ఈ డిమాండ్ పెరుగుతున్నట్లు వివరించారు. ఇక ఒక్కో విమానానికి 50 క్యాబిన్ సిబ్బంది ఉండాలి. అలాగే.. చెక్‌అవుట్ కౌంటర్‌లు, బ్యాగేజ్ హ్యాండ్లర్‌లతో సహా వివిధ ప్రదేశాలలో ప్రజలు అవసరాలను తగిన విధంగా సిబ్బంది అవసరం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Air India, Central Government Jobs, Indian airlines, JOBS