హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AIIMS Recruitment 2021: 678 న‌ర్సింగ్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. జీతం రూ.ల‌క్ష‌పైనే

AIIMS Recruitment 2021: 678 న‌ర్సింగ్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. జీతం రూ.ల‌క్ష‌పైనే

న‌ర్సింగ్ ఆఫిస‌ర్ రిక్రూట్‌మెంట్

న‌ర్సింగ్ ఆఫిస‌ర్ రిక్రూట్‌మెంట్

ఢిల్లీలోని వివిధ కేంద్ర ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ప‌ని చేసేందుకు ఎయిమ్స్ న్యూఢిల్లీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఎయిమ్స్ న్యూఢిల్లీ న‌ర్సింగ్ ఆఫీస‌ర్ రిక్రూట్‌మెంట్ కామ‌న్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Nursing Officer Recruitment Common Eligibility Test) 678 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుదల చేసింది. నార్‌సెట్‌ (NORCET) -2021 ద్వారా ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఇంకా చదవండి ...

  ఢిల్లీ (Delhi) లోని వివిధ కేంద్ర ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ప‌ని చేసేందుకు ఎయిమ్స్ న్యూఢిల్లీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఎయిమ్స్ న్యూఢిల్లీ న‌ర్సింగ్ ఆఫీస‌ర్ రిక్రూట్‌మెంట్ కామ‌న్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Nursing Officer Recruitment Common Eligibility Test) నోటిఫికేష‌న్ విడుదల చేసింది. నార్‌సెట్‌ (NORCET) -2021 ద్వారా ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 678 న‌ర్సింగ్ ఆఫీస‌ర్ ఉద్యోగాల‌ను ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఉంటుంది. ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారి వ‌య‌సు 18-35 ఏళ్ల మ‌ధ్య ఉండాలని నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ http://www.vmmc-sjh.nic.in/ ను సంద‌ర్శించాలి.

  ముఖ్య‌మైన స‌మాచారం..

  పోస్టున‌ర్సింగ్ ఆఫీస‌ర్‌
  జీతంLevel -7 (రూ.44,900- రూ.1,42,400)
  అర్హ‌త‌లున‌ర్సింగ్‌లో బీఎస్సీ (BSc) చేసి ఉండాలి లేదా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో న‌ర్సింగ్ విభాగంలో డిప్ల‌మా చేసి ఉండాలి. ఇండియ‌న్ న‌ర్సింగ్ కౌన్సిల్‌లో లేదా రాష్ట్రం నుంచి గుర్తింపు పొంది ఉండాలి.
  వ‌య‌సు18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. రిక్రూట్‌మెంట్ విధానాల ఆధారంగా వ‌య‌సు స‌డ‌లింపు ఉంటుంది.


  ఆస్పత్రుల వారీగా పోస్టుల వివ‌రాలు..

  ఆస్ప‌త్రి పేరుఖాళీల సంఖ్య
  డాక్ట‌ర్ ఆర్ఎమ్ఎల్ హాస్పిట‌ల్‌31
  సఫ్తార్‌జంగ్ హాస్పిట‌ల్‌529
  క‌ళావ‌తి స‌ర‌న్ చిల్డ్ర‌న్ హాస్పిట‌ల్‌29
  లేడీ హ‌ర్డింజ్ మెడిక‌ల్ కాలేజీ89


  ఎంపిక విధానం..

  - అభ్య‌ర్థులు ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

  - న‌ర్సింగ్ ఆఫీస‌ర్ రిక్రూట్‌మెంట్ (Recruitment) కామ‌న్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆధారంగా అభ్య‌ర్థుల తుది ఎంపిక ఉంటుంది.

  AIIMS Recruitment 2021 : ఎయిమ్స్ బీబీ న‌గ‌ర్‌లో 68 ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌


  ద‌ర‌ఖాస్తు విధానం..

  Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఉంటుంది.

  Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ http://www.vmmc-sjh.nic.in/ ను సంద‌ర్శించాలి.

  Step 3 :  అనంత‌రం నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

  Step 4 :  అర్హ‌త ఉన్న పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి https://norcet2021.aiimsexams.ac.in/?AspxAutoDetectCookieSupport=1 లింక్‌లోకి వెళ్లాలి.

  Step 5 :  అనంత‌రం రిజిస్ట్రేష‌న్ (Registration) పూర్తి చేసి ద‌ర‌ఖాస్తు ఫాం నింపాలి.

  Step 6 :  ద‌ర‌ఖాస్తు నింపిన త‌రువాత జ‌న‌రల్‌/ ఓబీసీ అభ్య‌ర్థులు రూ.3000 ప‌రీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థులు రూ.2500 ఫీజు చెల్లించాలి. పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఫీజు మిన‌హాయింపు ఉంది.

  Step 7 :  ద‌ర‌ఖాస్తు చేసుకోవడం పూర్త‌యిన త‌రువాత అప్లికేష‌న్ ఫాంను ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.

  Step 8 :  ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 30, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Health department jobs, Job notification, JOBS, Nursing

  ఉత్తమ కథలు