హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AIIMS Recruitment 2021: ఎయిమ్స్‌లో 775 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

AIIMS Recruitment 2021: ఎయిమ్స్‌లో 775 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

AIIMS Recruitment 2021: ఎయిమ్స్‌లో 775 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

AIIMS Recruitment 2021: ఎయిమ్స్‌లో 775 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

AIIMS Recruitment 2021 | రిషికేష్ లోని ఎయిమ్స్ 775 పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIMS, రిషికేషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 775 ఖాళీలను ప్రకటించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రెసిడెంట్, నర్సింగ్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, ఫార్మాసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హాస్పిటల్ అటెండెంట్, హౌజ్‌కీపింగ్ స్టాఫ్ లాంటి పోస్టులున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 500 పడకల కోవిడ్ కేర్ ఆస్పత్రి కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎయిమ్స్ రిషికేష్. ఇవి మూడు నెలల తాత్కాలిక పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కొనసాగుతోంది. 2021 మే 31 వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు https://aiimsrishikesh.edu.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ పూర్తిగా చదివి, అన్ని విద్యార్హతలు ఉంటే నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.

AIIMS Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 775

అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా సీనియర్ రెసిడెంట్ లేదా స్పెషలిస్ట్- 100

జూనియర్ రెసిడెంట్- 100

నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్ గ్రేడ్ 2)- 300

టెక్నికల్ అసిస్టెంట్- 40

ఫార్మాసిస్ట్- 15

డేటా ఎంట్రీ ఆపరేటర్- 20

హాస్పిటల్ అటెండెంట్- 100

హౌజ్‌కీపింగ్ స్టాఫ్- 100

SBI Clerk Jobs 2021: ఎస్‌బీఐలో 5454 క్లర్క్ జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

MES Recruitment 2021: మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్‌లో 572 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

AIIMS Recruitment 2021: విద్యార్హతల వివరాలు ఇవే...


అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా సీనియర్ రెసిడెంట్ లేదా స్పెషలిస్ట్- ఎంబీబీఎస్ పాస్ కావడంతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. లేదా పీహెచ్‌డీ మైక్రోబయాలజీ లేదా పీహెచ్‌డీ బయో కెమిస్ట్రీ పాస్ కావాలి.

జూనియర్ రెసిడెంట్- ఎంబీబీఎస్ లేదా ఎంఎస్సీ బయో కెమిస్ట్రీ లేదా ఎంఎస్సీ మైక్రోబయాలజీ

నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్ గ్రేడ్ 2)- బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్

టెక్నికల్ అసిస్టెంట్- మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో బీఎస్సీ

ఫార్మాసిస్ట్- డిప్లొమా ఇన్ ఫార్మసీ

డేటా ఎంట్రీ ఆపరేటర్- ఇంటర్ పాస్ కావడంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి

హాస్పిటల్ అటెండెంట్- మెట్రిక్యులేషన్

హౌజ్‌కీపింగ్ స్టాఫ్- 8వ తరగతి పాస్ కావాలి

DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో జాబ్స్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

LIC Agent Jobs: ఎల్ఐసీ ఏజెంట్‌గా చేరాలనుకుంటున్నారా? అప్లై చేయండి ఇలా

AIIMS Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


వాక్ ఇన్ ఇంటర్వ్యూ- 2021 మే 16 నుంచి మే 31 వరకు ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు

ఇంటర్వ్యూ జరిగే స్థలం- అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా సీనియర్ రెసిడెంట్ లేదా స్పెషలిస్ట్, జూనియర్ రెసిడెంట్ పోస్టులకు రిషికేషన్ ఎయిమ్స్‌లోని డీన్ కార్యాలయం. ఇతర పోస్టులకు అసిస్టెంట్ డీన్ కార్యాలయం.

First published:

Tags: CAREER, Covid hospital, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs

ఉత్తమ కథలు