తెలంగాణలోని బీబీనగర్‌లో గల ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIMS లో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. తెలంగాణలోని ఎయిమ్స్‌లో ఖాళీలను భర్తీ చేసేందుకు జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-JIPMER, పుదుచ్చెరీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 53 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 27 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.jipmer.edu.in/ వెబ్సైట్లో చూడొచ్చు.
AIIMS Bibinagar Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
మొత్తం ఖాళీలు- 53 (ప్రొఫెసర్- 06, అడిషనల్ ప్రొఫెసర్- 13, అసోసియేట్ ప్రొఫెసర్- 11, అసిస్టెంట్ ప్రొఫెసర్- 23)
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 27
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.