AIIMS Recruitment 2020: ఎయిమ్స్‌లో 418 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

AIIMS Recruitment 2020 | న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 418 ఖాళీలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: February 14, 2020, 1:24 PM IST
AIIMS Recruitment 2020: ఎయిమ్స్‌లో 418 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
AIIMS Recruitment 2020: ఎయిమ్స్‌లో 418 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIMS ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు హర్యానాలోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌‍స్టిట్యూట్‌లో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 418 ఖాళీలను ప్రకటించింది. బయోకెమిస్ట్, మెడికల్ ఫిజిసిస్ట్, స్టోర్ కీపర్, స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అత్యధికంగా ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్- 150, మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజిస్ట్- 110, స్టెనోగ్రాఫర్- 40 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.aiimsexams.org వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

AIIMS Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 418

సైంటిస్ట్- 14
బయోకెమిస్ట్- 4
మెడికల్ ఫిజిసిస్ట్- 8


స్టోర్ కీపర్- 19స్టెనోగ్రాఫర్- 40
ప్రోగ్రామర్- 10
టెక్నీషియన్ (రేడియాలజీ)- 24
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 6
జూనియర్ ఇంజనీర్ (సివిల్)- 3
జూనియర్ ఇంజనీర్ (ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్)- 4
మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజిస్ట్- 110
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- 2
లైఫ్ గార్డ్- 1
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్- 150
న్యూక్లియర్ మెడికల్ టెక్నాలజిస్ట్- 3
మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్- 5
ఫార్మాసిస్ట్- 8
శానిటరీ ఇన్‌స్పెక్టర్- 5
అసిస్టెంట్ వార్డెన్- 2

AIIMS Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 12
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 12 సాయంత్రం 5 గంటలు
దరఖాస్తు ఫీజు- ఓబీసీలకు రూ.1,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,200. దివ్యాంగులకు రిజిస్ట్రేషన్ ఫీజు లేదు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో 191 జాబ్స్... ఫిబ్రవరి 20 లాస్ట్ డేట్

IIT Hyderabad Jobs: ఐఐటీ హైదరాబాద్‌లో 152 జాబ్స్... ఫిబ్రవరి 17 లాస్ట్ డేట్

UPSC Civil Services 2020: గుడ్ న్యూస్... 796 పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ విడుదల
First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు