దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(All India Institute Of Medical Science) ఒకటి. ఈ ఇన్‌స్టిట్యూట్ ఇప్పుడు అర్హత గల అభ్యర్థుల నుంచి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎయిమ్స్ రాయపూర్‌లో గ్రూప్ A ఫ్యాకల్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్(Assistant Professor) పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ జనవరి 10 నుంచి ప్రారంభమవుతుంది. అర్హులైన వారు AIIMS రాయ్‌పూర్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా జనవరి 27 లోపు అప్లై చేసుకోవచ్చు.
రిజర్వేషన్ ప్రకారం 39 పోస్టుల భర్తీ
AIIMS రాయపూర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ విభాగాల్లో 39 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అభ్యర్థులను రిక్రూట్ చేసుకోనుంది. ఈ నియామకం మొదటి 11 నెలలు లేదా తదుపరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు ఉంటుంది. మొత్తం 39 పోస్టులను రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టులలో 11 పోస్టులు అన్ రిజర్వ్‌డ్ అభ్యర్థులకు కేటాయించారు. 17 సీట్లు ఓబీసీ అభ్యర్థులకు కేటాయించగా, అదనంగా నాలుగు పోస్టులను EWS, SC కేటగిరీ అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్థులకు 3 పోస్టులు కేటాయించారు.
అర్హత ప్రమాణాలు
సాధారణ విభాగాలకు అభ్యర్థులు తప్పనిసరిగా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో MD/MS అర్హత సాధించాలి లేదా సంబంధిత సబ్జెక్టులలో సమానమైన గుర్తింపు పొందిన డిగ్రీ ఉండాలి. అనస్థీషియాలజీ, బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, క్లినికల్ హెమటాలజీ, ఎండోక్రినాలజీ , మెటబాలిజం, గ్యాస్ట్రోఎంటరాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ట్రామానెర్జిడిక్ మెడికోలజీ , ట్రామా & ఎమర్జెన్సీ (జనరల్ సర్జరీ), ట్రామా & ఎమర్జెన్సీ (న్యూరో సర్జరీ) సబ్జెక్టులలో అర్హత పొందాలి. అభ్యర్థులు తప్పనిసరిగా M.D./M.S డిగ్రీని పొందిన తర్వాత గుర్తింపు పొందిన సంస్థలో స్పెషాలిటీ సబ్జెక్టులో మూడు సంవత్సరాల బోధన లేదా పరిశోధన అనుభవం కలిగి ఉండాలి. లేదా దానికి సమానమైన గుర్తింపు అవసరం.
అసిస్టెంట్ ప్రొఫెసర్ మెడికల్ అభ్యర్థులు (సాధారణ విభాగం) అర్హతతో పాటు, సూపర్-స్పెషాలిటీ విభాగాలకు మెడికల్ సూపర్ స్పెషాలిటీ, M.Ch విభాగాలలో సంబంధిత సబ్జెక్టులో DM కలిగి ఉండాలి లేదా సమానమైన డిగ్రీ ఉండాలి. MBBS లేదా తత్సమాన అర్హత డిగ్రీ తర్వాత D.M./M.Ch లో అర్హత డిగ్రీని పొంది స్పెషాలిటీ సబ్జెక్టులో గుర్తింపు పొందిన సంస్థలో ఒక సంవత్సరం బోధన/లేదా పరిశోధన అనుభవం కలిగి ఉండాలి. అయితే D.M./M.Ch అర్హత లేదా దానికి సమానమైనదిగా గుర్తించిన 3 సంవత్సరాలు డిగ్రీని కలిగి ఉన్న అభ్యర్థులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయోపరిమితి: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి 50 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులు. అయితే రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు వయసు సడలింపు ఉంది.
అప్లికేషన్ ఫీజు
జనరల్, OBC, EWS కేటగిరీకి చెందిన అభ్యర్థులకి రూ.1000 అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు. మహిళలు, SC, ST, PwBD, మాజీ సైనికులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
జీతం
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,42,506 వరకు జీతం అందుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.