AIIMS Recruitment 2020: నిరుద్యోగులకు ఎయిమ్స్ శుభవార్త.. రూ. 67 వేల వేతనంలో ఉద్యోగాలు

ప్రతీకాత్మక చిత్రం

AIIMS Raipur Recruitment 2020: నిరుద్యోగులకు ఆల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(AIIMS), రాయిపూర్ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లోని సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వివరాలివే..

  • Share this:
    నిరుద్యోగులకు ఆల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(AIIMS), రాయిపూర్ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లోని సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 3న ఈ పోస్టులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 18లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.67 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

    ఖాళీల వివరాలు..
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 142 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 64 అన్ రిజర్వ్డ్ కాగా.. 35 ఓబీసీలకు, 28 ఎస్సీలకు, 8 EWS, మరో 7 ఎస్టీ అభ్యర్థులకు కేటాయించారు. General/EWS/OBC అభ్యర్థులు రూ. వేయి అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 800 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
    విద్యార్హతల వివరాలు..
    MD/MS/DNBతో పాటు సంబంధిత విభాగాల్లో డిప్లొమా చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఇతర అర్హతలు, వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
    Official Notification-Direct Link
    Published by:Nikhil Kumar S
    First published: