Jobs: ఎయిమ్స్‌లో 3803 ఉద్యోగాలు... ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఖాళీలు

AIIMS NORCET 2020 | ఎయిమ్స్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలోని ఎయిమ్స్‌లో కూడా ఖాళీలున్నాయి.

news18-telugu
Updated: August 7, 2020, 5:51 PM IST
Jobs: ఎయిమ్స్‌లో 3803 ఉద్యోగాలు... ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఖాళీలు
Jobs: ఎయిమ్స్‌లో 3803 ఉద్యోగాలు... ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఖాళీలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIMS ఢిల్లీ నర్సింగ్ ఆఫీసర్ గ్రూప్ బీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3803 ఖాళీలను ప్రకటించింది. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-NORCET 2020 ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు అన్ని రాష్ట్రాల్లోని ఎయిమ్స్‌లో ఈ ఖాళీలున్నాయి. తెలంగాణలోని ఎయిమ్స్‌కు పోస్టుల్ని కేటాయించలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో గల ఎయిమ్స్‌లో మాత్రం 140 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 ఆగస్ట్ 5న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 18 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబధించిన పూర్తి వివరాలను https://www.aiimsexams.org/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

IBPS RRB 2020: మొత్తం 9640 బ్యాంకు ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ఐబీపీఎస్... సిలబస్ ఇదే

UPSC Jobs: ఇంటర్, డిగ్రీ అర్హతతో 344 ఉద్యోగాలు... హైదరాబాద్‌లోనూ ఖాళీలు

AIIMS Nursing Officer recruitment, AIIMS Nursing Officer jobs, AIIMS NORCET 2020 notification, AIIMS NORCET 2020 registration, AIIMS Mangalagiri jobs, AIIMS Andhra Pradesh, ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్, ఎయిమ్స్ మంగళగిరి ఉద్యోగాలు, ఎయిమ్స్ ఆంధ్రప్రదేశ్
ప్రతీకాత్మక చిత్రం

AIIMS NORCET 2020: ఖాళీల వివరాలు ఇవే...


ఎయిమ్స్ మంగళగిరి- 140
ఎయిమ్స్ న్యూఢిల్లీ- 597

ఎయిమ్స్ బఠిండా- 600
ఎయిమ్స్ డియోగఢ్- 150
ఎయిమ్స్ గోరఖ్‌పూర్- 100
ఎయిమ్స్ జోధ్‌పూర్- 176
ఎయిమ్స్ కళ్యాణి- 600
ఎయిమ్స్ నాగ్‌పూర్- 100
ఎయిమ్స్ పాట్నా- 200
ఎయిమ్స్ రాయ్ బరేలీ- 594
ఎయిమ్స్ రాయ్‌పూర్- 246
ఎయిమ్స్ రిషికేష్- 300

SBI Jobs: ఎస్‌బీఐలో 3850 ఉద్యోగాలు... డిగ్రీ పాసైతే చాలు

IBPS PO: ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది... డిగ్రీ అర్హతతో 1167 పోస్టులు

AIIMS Nursing Officer recruitment, AIIMS Nursing Officer jobs, AIIMS NORCET 2020 notification, AIIMS NORCET 2020 registration, AIIMS Mangalagiri jobs, AIIMS Andhra Pradesh, ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్, ఎయిమ్స్ మంగళగిరి ఉద్యోగాలు, ఎయిమ్స్ ఆంధ్రప్రదేశ్
ప్రతీకాత్మక చిత్రం

AIIMS NORCET 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 5
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 18 సాయంత్రం 5 గంటలు
నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ తేదీ- 2020 సెప్టెంబర్ 1
విద్యార్హత- బీఎస్సీ (Hons.) నర్సింగ్ / బీఎస్సీ నర్సింగ్ / బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికెట్) / పోస్ట్ బేసిక్ బీఎస్సీ / డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ
అనుభవం- 50 పడకల ఆస్పత్రిలో కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు- 18 నుంచి 30 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1200, దివ్యాంగులకు ఫీజు లేదు.
Published by: Santhosh Kumar S
First published: August 7, 2020, 5:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading