ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాగ్‌పూర్ (AIIMS నాగ్‌పూర్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు.. ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని కోసం ఎయిమ్స్ నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక సైట్ aiimsnagpur.edu.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తులకు చివరి తేదీ 11 సెప్టెంబర్ 2022. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 29 పోస్టులను భర్తీ చేస్తారు.
ఖాళీ వివరాలు
AIIMS నాగ్‌పూర్‌లో 8 ప్రొఫెసర్‌ల పోస్టులు, 9 అదనపు ప్రొఫెసర్‌లు, 5 అసోసియేట్ ప్రొఫెసర్‌లు అండ్ 7 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల పోస్టులను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు ఫీజు..
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.2 వేలు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC/ST అభ్యర్థఉలకు దరఖాస్తు ఫీజు రూ.500గా నిర్ణయంచారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన పేమెంట్ లింక్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు ఇలా..
-ముందుగా అభ్యర్థులు ఈ లింక్ పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి.
-వీటిలో అప్ లోడ్ చేయాల్సిన డాక్యెమెంట్స్ ను దగ్గర ఉంచుకోవాలి.
- తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి. దాని కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
-దీనిలో పేర్కొన్న వివరాలను నమోదు చేసి.. ఫారమ్‌తో పాటు విద్యార్హత, అనుభవం, వయస్సు సర్టిఫికేట్ మొదలైన అన్ని అవసరమైన పత్రాలను జత చేయాలి.
-తర్వాత పైన చెప్పిన లింక్ లో ఈ ఫైళ్లను అటాచ్ చేయాలి.
-చివరగా.. దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని.. దరఖాస్తు ఫారమ్ ను ఫిల్ చేసి AIIMS నాగ్‌పూర్, అడ్మినిస్ట్రేటివ్ స్పీడ్/రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా బ్లాక్, ప్లాట్ నెం. 2, సెక్టార్-20, మిహాన్, నాగ్‌పూర్ - 441108కి పంపాలి. దరఖాస్తు ఫారమ్‌ను పంపించడగానికి చివరి తేదీ 26 సెప్టెంబర్ 2022గా నిర్ణయించబడింది.
ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక సైట్ ను సందర్శించండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aiims, CAREER, Career and Courses, Central governmennt, JOBS, Nagapur