ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో (AIIMS) ఉద్యోగాలు ఉన్నాయి. ఫ్యాకల్టీ (Group A) పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ప్రొఫెసర్, లెక్చరర్ లాంటి పోస్టులు ఉన్నాయి. మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 14 చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు విద్యార్హతలతో పాటు అనుభవం ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఖాళీలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు | 6 |
ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపాల్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ | 1 |
లెక్చరర్ ఇన్ నర్సింగ్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), కాలేజ్ ఆఫ్ నర్సింగ్ | 5 |
WCL Recruitment 2021: వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,281 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 14
విద్యార్హతలు- ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపాల్ పోస్టుకు నర్సింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. నర్స్ అండ్ మిడ్‌వైఫ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. 10 ఏళ్లు అనుభవం ఉండాలి. లెక్చరర్ ఇన్ నర్సింగ్ పోస్టుకు నర్సింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. మిడ్‌వైఫ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. నర్సింగ్‌లో రెండేళ్ల అనుభవంతో పాటు మొత్తం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
వయస్సు- 50 నుంచి 58 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- రూ.1,000
వేతనం- లెక్చరర్ ఇన్ నర్సింగ్ పోస్టుకు రూ.1,23,100 బేసిక్ వేతనంతో మొత్తం రూ.2,15,900 వేతనం లభిస్తుంది. లెక్చరర్ ఇన్ నర్సింగ్ పోస్టుకు రూ.67,700 బేసిక్ వేతనంతో రూ.2,08,700 మొత్తం వేతనం లభిస్తుంది.
ఎంపిక విధానం- ఇంటర్వ్యూ
RWF Recruitment 2021: రైల్వే జాబ్ మీ కలా? రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 ఉద్యోగాలకు అప్లై చేయండిలా
Step 1- అభ్యర్థులు ముందుగా https://aiimsmangalagirinursing.cbtexam.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో NEW REGISTRATION పైన క్లిక్ చేయాలి.
Step 3- పోస్టు సెలెక్ట్ చేయాలి. అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 4- లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ జనరేట్ అవుతుంది. ఆ వివరాలతో లాగిన్ కావాలి.
Step 5- లాగిన్ ఐయిన తర్వాత కొత్త పాస్‌వర్డ్ క్రియేట్ చేయాలి.
Step 6- ఆ తర్వాత విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
Step 7- ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
Step 8- వివరాలన్నీ సరిచూసుకొని ఫీజు పేమెంట్ చేయాలి.
Step 9- దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aiims, Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, Mangalagiri, Telugu news, Telugu updates, Telugu varthalu