AIIMS Recruitment : ఎయిమ్స్ డియోఘర్ జూనియ‌ర్ రెసిడెంట్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే

ఎయిమ్స్ డియోఘర్

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్‌ (All India Institute Of Medical Science)లో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న జూనియ‌ర్ రెసిడెంట్ (Junior Resident) పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.

  • Share this:
    ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్‌ (All India Institute Of Medical Science)లో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న జూనియ‌ర్ రెసిడెంట్ (Junior Resident) పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. వీటికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి నోటిఫికేష‌న్ (Notification) ప్ర‌చురితం అయిన 15 రోజుల వ‌ర‌కు అవ‌కాశం ఉంది. అంటే అక్టోబ‌ర్ 15, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఎంపిక విధానం ఎటువంటి రాత ప‌రీక్ష (Written Exam) లేకుండా పూర్తిగా మెరిట్ (Merit) ఆధారంగా ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి ఎంపి చేస్తారు. ద‌ర‌ఖాస్తు ప్రక్రియ‌ కూడా ఆఫ్‌లైన్ (Offline) ప‌ద్ధ‌తిలోనే ఉంటుంది. ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్, అప్లికేష‌న్ విధానం కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.aiimsdeoghar.edu.in/recruitments/list ను సంద‌ర్శించాలి.

    ముఖ్య స‌మాచారం..













    పోస్టు పేరు అర్హ‌త‌లు ఖాళీలు
       జూనియ‌ర్ రెసిడెంట్   గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి.  28

    ప‌రీక్ష ఫీజు
    - జ‌న‌ర‌ల్ అండ్ ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.1000 ప‌రీక్ష ఫీజు
    - ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఈడ‌బ్ల్యూఎస్‌ (EWS), మ‌హిళ‌ల‌కు ప‌రీక్ష ఫీజు లేదు.
    - ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. AIIMS Patna”
    payable at Patna పేరున డీడీ తీయాలి.


    ILS Recruitment 2021: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.56,000


    ఎంపిక విధానం..

    Step 1 :  ఎంపిక‌లో ఎటువంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించరు.

    Step 2 :  పోస్టులను అనుస‌రించి అభ్య‌ర్థి త‌మ అర్హ‌త‌ల వివ‌రాలు, అనుభ‌వాన్ని పంపిన ద‌ర‌ఖాస్తును ప‌రిశీలిస్తారు.

    Step 3 :  వాటి ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు.

    Step 4 : షార్ట్‌లిస్ట్ (Short List) అయిన అభ్య‌ర్థుల‌కు ఆన్‌లైన్ ద్వారా ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించి తుది ఎంపిక చేస్తారు.

    గ‌మ‌నిక - ఇంట‌ర్వ్యూ  (Interview) నాటికి అభ్య‌ర్థి వ‌య‌సు 33 ఏళ్లు మించ‌కూడదు.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 :  ద‌ర‌ఖాస్తు విధానం పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Step 1 :  ముంద‌గా అధికారిక వెబ్‌సైట్ https://www.aiimsdeoghar.edu.in/recruitments/list ను సంద‌ర్శించాలి.

    Step 2 :  అనంత‌రం నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 3 :  నోటిఫికేష‌న్ చివ‌ర‌న అప్లికేష‌న్ ఫాం ఉంటుంది.

    Step 4 :   ఫాంను త‌ప్పులు లేకుండా పూర్తిగా నింపాలి.

    Step 5 :  విద్యార్హ‌త‌, అనుభ‌వం స‌ర్టిఫికెట్ల జిరాక్స్ కాపీల‌ను ద‌ర‌ఖాస్తుకు జ‌త చేయాలి.
    - ప‌దోత‌ర‌గ‌తి స‌ర్టిఫికెట్
    - ఎంబీబీఎస్ పాస్ స‌ర్టిఫికెట్‌
    - అనుభ‌వం సంబంధిత ధ్రువ‌ప‌త్రాలు

    Step 6 :  వాటిని
    Registrar Officer,
    AIIMS Deoghar Temporary Campus,
    Panchayat Training Institute,
    Daburgram, Jasidih,
    Deoghar- 814142 (Jharkhand) అడ్ర‌స్‌కు పోస్టు ద్వారా పంపాలి.

    Step 6 :  ద‌రఖాస్తుకు అక్టోబ‌ర్ 15, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published: