AIIMS Delhi Recruitment 2020: AIIMSలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఎల్లుండే ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు ఆల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) శుభవార్త చెప్పింది. పలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 168 సీనియర్ రెసిడెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 27న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

  • Share this:
    నిరుద్యోగులకు ఆల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) శుభవార్త చెప్పింది. పలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 168 సీనియర్ రెసిడెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 27న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్లో దరఖాస్తులను ఈ నెల 27లోగా ఏయిమ్స్ అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ఆ దరఖాస్తును పూర్తి చేసి నవంబర్ 27 ఉదయం 11 గంటలలోగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇంటర్వ్యూలు ఉంటాయి. అభ్యర్థులు వారు దరఖాస్తు చేసుకునే పోస్టు ఆధారంగా MD/MS/DNB/MHA/Ph.D తదితర విద్యార్హతను పొంది ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. వివిధ విభాగాల్లో మొత్తం 168 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
    Notification-Direct Link


    India Security Pressలో ఉద్యోగాలు.. రూ.1.10 లక్షల వరకు వేతనం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

    ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై ట్రేడ్స్‌లో ఎయిర్‌మెన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 నవంబర్ 27న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి నవంబర్ 28 చివరి తేదీ. అంటే అప్లై చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ రెండు రోజుల్లోనే దరఖాస్తు చేసేందుకు సిద్ధం కావాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

    దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://airmenselection.cdac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. దరఖాస్తు లింక్ నవంబర్ 27న యాక్టివేట్ అవుతుంది. ఇక దరఖాస్తు చేసుకున్న వారికి రిక్రూట్‌మెంట్ ర్యాలీ 2020 డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 19 మధ్య జరుగుతుంది. న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, పుదుచ్చెరీలో ర్యాలీలు ఉంటాయి. ర్యాలీ వివరాలు నోటిఫికేషన్‌లో ఉంటాయి.
    Published by:Nikhil Kumar S
    First published: