తెలంగాణలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIMS లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. గతేడాది కొన్ని పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 141 పోస్టులతో మరో నోటిఫికేషన్ విడుదల చేసింది జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-JIPMER. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో గల ఎయిమ్స్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది జిప్మర్. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి జూన్ 24 చివరి తేదీ. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి అప్లికేషన్ ఫామ్‌ను నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది. ఇమెయిల్ కాపీ కూడా పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.jipmer.edu.in/ వెబ్సైట్లో చూడొచ్చు.
AIIMS Bibinagar Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 141
ప్రొఫెసర్- 20
అడిషనల్ ప్రొఫెసర్- 22
అసోసియేట్ ప్రొఫెసర్- 34
అసిస్టెంట్ ప్రొఫెసర్- 65
AIIMS Bibinagar Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2020 మే 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 24
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
పోస్టులో దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Nodal Officer
Office of AIIMS, Bibinagar,
Room No.111, Second Floor,
Administrative Block,
JIPMER, Puducherry-605 006.
దరఖాస్తు కాపీ పంపాల్సి ఇమెయిల్ ఐడీ: aiimsfacultyhr@gmail.com
నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 235 జాబ్స్... మే 9 లాస్ట్ డేట్
Jobs: వెస్టర్న్ కోల్‌ఫీల్డ్‌లో 303 జాబ్స్... మొదలైన దరఖాస్తు ప్రక్రియ
Govt Jobs: సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు... డిప్లొమా, డిగ్రీ పాసైతే చాలుPublished by:Santhosh Kumar S
First published:May 07, 2020, 15:42 IST