HOME »NEWS »JOBS & EDUCATION »aiims bibinagar recruitment 2020 jipmer extended online application deadline for 141 posts in aiims telangana till july 24 ss

Jobs: తెలంగాణలోని ఎయిమ్స్‌లో 141 జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

Jobs: తెలంగాణలోని ఎయిమ్స్‌లో 141 జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు
Jobs: తెలంగాణలోని ఎయిమ్స్‌లో 141 జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం)

AIIMS Bibinagar Recruitment 2020 | తెలంగాణలోని ఎయిమ్స్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పెరిగింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    తెలంగాణలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIMS లో 141 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి జూన్ 24 చివరి తేదీ. అయితే విద్యార్హతల్లో కొన్ని మార్పులు చేయడంతో దరఖాస్తు గడువును పెంచింది జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-JIPMER. ఆన్‌లైన్ దరఖాస్తుకు కొత్త డెడ్‌లైన్ ప్రకటించింది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 24 వరకు దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో గల ఎయిమ్స్‌లో 141 పోస్టుల్ని భర్తీ చేయనుంది జిప్‌మర్. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి పోస్టులున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి అప్లికేషన్ ఫామ్‌ను నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు, ఇమెయిల్ ఐడీకి పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.jipmer.edu.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

    AIIMS Bibinagar Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 141


    ప్రొఫెసర్- 20
    అడిషనల్ ప్రొఫెసర్- 22
    అసోసియేట్ ప్రొఫెసర్- 34
    అసిస్టెంట్ ప్రొఫెసర్- 65

    AIIMS Bibinagar Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 మే 1
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 24 సాయంత్రం 5 గంటలు
    దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ- 2020 ఆగస్ట్ 7 సాయంత్రం 4.30 గంటలు
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
    పోస్టులో దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
    The Nodal Officer
    Office of AIIMS, Bibinagar,
    Room No.111, Second Floor,
    Administrative Block,
    JIPMER, Puducherry-605 006.
    దరఖాస్తు కాపీ పంపాల్సి ఇమెయిల్ ఐడీ: aiimsfacultyhr@gmail.com

    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు గడువు పొడిగిస్తూ జారీ చేసిన నోటీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    ECIL Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 82 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

    ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... దరఖాస్తు చేయడానికి మరో ఛాన్స్

    IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1004 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published:June 14, 2020, 17:13 IST

    टॉप स्टोरीज