హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AIIMS Recruitment 2021 : ఎయిమ్స్ బీబీ న‌గ‌ర్‌లో 68 ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌

AIIMS Recruitment 2021 : ఎయిమ్స్ బీబీ న‌గ‌ర్‌లో 68 ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌

ఎయిమ్స్ బీబీన‌గ‌ర్‌

ఎయిమ్స్ బీబీన‌గ‌ర్‌

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(All India Institute of Medical Sciences), బీబీన‌గ‌ర్ లో పలు ఉద్యోగా భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌లైంది. దీని ద్వారా నాన్ అక‌డామిక్ విభాగంలో 68 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 9, 2021 వ‌ర‌కు అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(All India Institute of Medical Sciences), బీబీన‌గ‌ర్ లో పలు ఉద్యోగా భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌లైంది. ఏయిమ్స్ రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేష‌న్ ద్వారా నాన్ అక‌డ‌మిక్ విభాగంలో 68 సీనియ‌ర్ రెసిడెంట్లు (Senior Resident), జూనియ‌ర్ రెసిడెంట్లు (Junior Resident) పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఖాళీల భ‌ర్తీ ఎటువంటి ప‌రీక్ష లేకుండా కేవ‌లం మెరిట్ ద్వారా ఎంపిక చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్ మోడ్‌లో ఉంటుంది.  పోస్టుల ఆధారంగా ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల గ‌రిష్ట‌ వ‌య‌సు 37ఏళ్లు, 45 ఏళ్లు మించ‌కూడ‌దు. ద‌రాఖాస్తు విధానం, నోటిఫికేష‌న్ స‌మాచారం ప్ర‌కారం అధికారిక వెబ్‌సైట్ https://aiimsbibinagar.edu.in/seniorresident.html ను సంద‌ర్శించాలి.

పోస్టుల స‌మాచారం.. అర్హ‌త‌లు

పోస్టు పేరుఅర్హ‌త‌లుఖాళీలు
సీనియ‌ర్ రెసిడెంట్లుగుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో మైక్రోబ‌యోల‌జీ, ఫార్మ‌కాల‌జీ, రేడియాల‌జీ, ఆప్త‌మాల‌జీ త‌దిత‌ర విభాగాల్లో ఎండీ/ఎంఎస్‌/ డీఎం/ఎంసీహెచ్ /డీఎన్‌బీ మెడిక‌ల్ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. ద‌ర‌ఖాస్తుదారు వ‌య‌సు 45 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.38
జూనియ‌ర్ రెసిడెంట్లుగుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా ఎంసీఐ లేదా రాష్ట్ర‌లో గుర్తింపు పొంది ఉండాలి.25


SSC Recruitment 2021 : ప‌ది, ఇంట‌ర్ విద్యార్థుల‌కు మంచి అవ‌కాశం.. ఎస్ఎస్‌సీలో 1,775 పోస్టులు


ఎంపిక విధానం..

- పోస్టుల క‌న్నా ద‌ర‌ఖాస్తు మూడు రెట్లు ఎక్కువ వ‌స్తే రాత ప‌రీక్ష (Written Test) నిర్వ‌హిస్తారు.

- త‌క్కువ అప్లికేష‌న్‌లు వ‌స్తే మెరిట్ (Merit) ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేస్తారు.

- షార్ట్ లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ (Interview) చేసి తుది ఎంపిక చేస్తారు.


ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 : ద‌ర‌ఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్ (Online) ద్వారా ఉంటుంది.

IIT Hyderabad: అవకాశాలే లక్ష్యంగా.. ఐఐటీ హైదరాబాద్​లో మూడు కొత్త బీటెక్​ కోర్సులు


Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://aiimsbibinagar.edu.in/seniorresident.html ను సంద‌ర్శించాలి.

Step 3 : సీనియ‌ర్ రెసిడెంట్లు.. జూనియ‌ర్ రెసిడెంట్ల‌కు వేర్వేరుగా నోటిఫికేష‌న్‌లు ఉన్నాయి వాటిని చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

Step 4 : నోటిఫికేష‌న్‌ను చివ‌ర‌న అప్లికేష‌న్ ఫాం (Application Form) ను డౌన్‌లోడ్ చేసుకొని అప్లికేష‌న్ నింపాలి.

Step 5 : అనంత‌రం అప్లికేష‌న్‌ను స్కాన్ చేసి అవ‌స‌ర‌మై ద‌ర‌ఖాస్తుల‌ను మెయిల్ (Mail) ద్వారా పంపాలి.

Step 6 : ద‌ర‌ఖాస్తు చేయాల్సిన మెయిల్‌ ace.aiimsbbnagar@gmail.com

Step 7 : ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 9, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

First published:

Tags: Aiims, Govt Jobs 2021, Health department jobs, Job notification, JOBS

ఉత్తమ కథలు