Job News : ప్రస్తుతం భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) రెండు పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ రీసెర్చ్ కన్సల్టెంట్ (Research Consultant), ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ (Field Investigator) పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తోంది. ఎక్స్ట్రామ్యూరల్ ఫండెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఎయిమ్స్, భువనేశ్వర్ ఈ ప్రాజెక్ట్ కింద ఒడిశాలోని జాజ్‌పూర్, గజపతి, ఝార్సుగూడ, అంగుల్ అనే నాలుగు జిల్లాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లలో పనిచేస్తున్న మెడికల్ లేబొరేటరీ టెక్నీషియన్ల ప్రస్తుత సామర్థ్యాలను అంచనా వేస్తుంది.
రీసెర్చ్ కన్సల్టెంట్ పోస్టు వివరాలు, అర్హతలు
ఒక రీసెర్చ్ కన్సల్టెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఎంపికైన అభ్యర్థి ఉద్యోగం ఐదు నెలల పాటు ఉంటుంది. రీసెర్చ్ కన్సల్టెంట్ ఉద్యోగం పొందాలనుకునే వారు కమ్యూనిటీ మెడిసిన్‌లో MD, MBBS/BDS లేదా పబ్లిక్ హెల్త్/ఎపిడెమియాలజీ/హెల్త్ కేర్ మేనేజ్మెంట్/హెల్త్ అడ్మినిస్ట్రేటివ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పైన పేర్కొన్న ఫీల్డ్‌లలో ఏదో ఒక దాంట్లో MBBS/BDS లేదా మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులకు తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. జాతీయ లేదా రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్/పబ్లిక్ హెల్త్ ఎపిడెమియాలజీ/పబ్లిక్ హెల్త్ రీసెర్చ్‌లో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. దరఖాస్తుదారులు ప్రాజెక్ట్ కోసం జాజ్‌పూర్, గజపతి, ఝార్సుగూడ, అంగుల్ జిల్లాలకు ప్రయాణించడానికి సిద్ధంగా ఉండాలి. రూ.1,00,000 వరకు నెల జీతం లభిస్తుంది.
ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టు వివరాలు, అర్హతలు
ఎక్స్ట్రామ్యూరల్ ఫండెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టుకు రెండు నెలల వ్యవధి ఉంటుంది. ఈ పోస్ట్‌కు అర్హత సాధించడానికి, అభ్యర్థులు తప్పనిసరిగా B.Sc చేసి ఉండాలి. మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ (MLT)లో డిగ్రీ, మెడికల్/పాథాలజీ లేబొరేటరీలో కనీసం ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం ఉండాలి. రూ.25,000 జీతం పొందవచ్చు. పైన చెప్పిన ఉద్యోగాలు నిధుల ప్రాజెక్ట్ కింద అందించే పదవీకాల ఉద్యోగాలు అని గమనించాలి. ఈ ప్రాజెక్ట్ కోసం నిధులను యాక్సెస్ హెల్త్ ఇంటర్నేషనల్ (హెల్త్ సిస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్, న్యూఢిల్లీ) అందిస్తోంది.
దరఖాస్తు వివరాలు, ఎంపిక ప్రక్రియ
అధికారిక నోటిఫికేషన్లో ఇచ్చిన ఫారమ్ ద్వారా అభ్యర్థులు సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఫారమ్‌ను అక్టోబర్ 25న లేదా అంతకు ముందు labhematologyaiimsbbsr@gmail.comకు ఈమెయిల్ చేయాలి. వీరికి అక్టోబర్ 31న AIIMS భువనేశ్వర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆ ఇంటర్వ్యూలలో అభ్యర్థి పనితీరు ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక ఫలితాలు AIIMS భువనేశ్వర్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు డాక్టర్ గౌరవ్ ఛబ్రా, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పాథాలజీ & ల్యాబ్ మెడిసిన్- "కాంపిటెన్సీ అసెస్మెంట్ ఆఫ్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెట్టింగ్స్ ఇన్ ఒడిషా" అనే అధ్యయనంలో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ కింద పని చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aiims, Bhuvaneshwar