AICTES INDIAN KNOWLEDGE SYSTEMS LAUNCHES 2 MONTH INTERNSHIP STIPEND RS 25000 GH VB
Students-Stipend: విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందులో సెలెక్ట్ అయితే రూ.25,000 స్టైఫండ్.. ఎలా అంటే..
ప్రతీకాత్మక చిత్రం
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)కు చెందిన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ (IKS) విద్యార్థులకు తీపి కబురు అందించింది. ఐకేఎస్ (IKS)లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఒక స్టూడెంట్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం ను ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ తాజాగా లాంచ్ చేసింది.
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE)కు చెందిన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ (IKS) విద్యార్థులకు తీపి కబురు అందించింది. ఐకేఎస్ (IKS)లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఒక స్టూడెంట్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం (Student internship programme)ను ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ తాజాగా లాంచ్ చేసింది. ఇది కొత్త ఐకేఎస్ కేంద్రాలకు ప్రపోజల్స్‌తో పాటు, పోటీ పరిశోధన ప్రపోజల్స్ కూడా లాంచ్ చేసింది. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయిన విద్యార్థులు ఆయా రంగంలో విస్తారమైన అనుభవాన్ని కలిగి ఉన్న ఐకేఎస్ నిపుణుల సహాయంతో తమ జ్ఞానం పెంచుకుంటారు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం, ఈ స్టూడెంట్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంకు సెలెక్ట్ అయిన ప్రతి ఇంటర్న్ సుమారు రూ. 25,000 స్టైఫండ్ (stipend) అందుకుంటారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు, నిపుణులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఐకేఎస్ డివిజన్ అధికారిక వెబ్సైట్ iksindia.org ని సందర్శించవచ్చు.
ఈ ప్రోగ్రాంలో విద్యార్థులు నిపుణుల సంప్రదింపుల మేరకు ఐకేఎస్ డివిజన్ సూచించినట్లుగా ఇంటర్నేషనల్ షార్ట్ రీసెర్చ్ ప్రాజెక్టులు, యాక్టివిటీస్ / వర్క్‌షాప్‌లు మొదలైన వాటిపై పనిచేయాల్సి ఉంటుంది. ఏఐసీటీఈ పథకం కింద సెంటర్ స్థాపించడానికి, సంబంధిత యాక్టివిటీస్‌లు నిర్వహించడానికి సంస్థకు రెండేళ్లలో రూ. 30-40 లక్షల నిధుల మద్దతును ఐకేఎస్ విభాగం అందిస్తుంది. ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ యాక్టివిటీస్‌లను ప్రోత్సహించేందుకు ఐకేఎస్ డివిజన్ ఈ కొత్త ప్రోగ్రాంను ప్రారంభించిందని ఏఐసీటీఈ పేర్కొంది. ఇది భారతీయ జ్ఞాన వ్యవస్థ (Indian knowledge systems)లపై లోతైన అవగాహన ఆధారంగా సమకాలీన సామాజిక సమస్యలకు స్థిరమైన స్వదేశీ పరిష్కారాలను కనుగొనడానికి... అవసరమైన చోట ఆధునిక సాధనాలు, విధానాలను ఉపయోగించి సంప్రదాయ భావనలు, పద్ధతులు, సాంకేతికతలు లేదా విధానాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశోధన, విద్య, ఔట్రీచ్ యాక్టివిటీస్ ప్రారంభించడానికి ఉత్ప్రేరకంగా పనిచేయడమే ఐకేఎస్ కేంద్రాల లక్ష్యం. “ఐకేఎస్ యాక్టివిటీస్ ప్రస్తుతం దేశంలోని చాలా ప్రదేశాలలో విస్తరించడం జరిగింది. ఈ ప్రయత్నాలపై దృష్టి సారించడానికి సాంప్రదాయ పాఠశాలలు, స్టెమ్ విద్యా సంస్థలలో దేశంలో ఐకేఎస్ కేంద్రాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఈ చొరవ ఐకేఎస్ కేంద్రాలను స్థాపించే అవసరాన్ని పరిష్కరిస్తుంది. అలాగే భారతీయ యువత మన సంప్రదాయ పద్ధతులను కూడా నేర్చుకోవడానికి, పరపతిని పొందేందుకు వీలు కల్పిస్తుంది" అని ఏఐసీటీఈ తెలిపింది.
"భారతీయ నాలెడ్జ్ సిస్టమ్స్‌లో ఒరిజినల్, సీరియస్, లోతైన స్కాలర్లీ రీసెర్చ్‌లను ప్రోత్సహించే ఉత్ప్రేరక నిధులను అందించడం, భారతదేశంలో ఐకేఎస్ పరిశోధనను పునరుద్ధరించడమే మా లక్ష్యం. కాంపిటేటివ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్స్ సపోర్ట్ చేసే ప్రయత్నంలో ఐకేఎస్ డివిజన్ యాక్టివిటీస్‌కు మద్దతు ఇవ్వడానికి విద్యా మంత్రిత్వ శాఖ విచక్షణాపరమైన నిధులు అందించింది" అని కౌన్సిల్ పేర్కొంది. ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్ కోసం అందుబాటులో ఉన్న నిధుల స్థాయిని మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.