హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AICTE Scholarship 2021: పీజీ విద్యార్థుల‌కు నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

AICTE Scholarship 2021: పీజీ విద్యార్థుల‌కు నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

AICTE Scholarship 2021

AICTE Scholarship 2021

AICTE Scholarship 2021: ఉన్న‌త చ‌దువు అభ్య‌సించే విద్యార్థులకు ఆర్థిక చేయూతనందించేందుకు ఏఐసీటీ స్కాల‌ర్‌షిప్ అందిస్తుంది. ఈ స్కాల‌ర్‌షిప్ పొందేందుకు ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఈ ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 31, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

పీజీ విద్యార్థులకోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (All India Council for Technical Education) పీజీ విద్యార్థుల‌కు నెల‌వారీ స్కాల‌ర్‌షిప్ (Scholarship) అందిస్తోంది. ఈ స్కాల‌ర్‌షిప్ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అవ‌కాశం క‌ల్పిస్తోంది. కేవ‌లం ఆన్‌లైన్ ద్వారానే ఈ స్కాల‌ర్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కాల‌ర్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులు 24 నెలల వ్యవధికి, అంటే కోర్సు ప్రారంభమైన తేదీ నుంచి పూర్తయ్యే వరకు నెలవారీ స్కాలర్‌షిప్ రూ .12,400 పొందుతారు. ఎంపికైన అభ్యర్థులు ఒక విద్యా సంవత్సరంలో గరిష్టంగా 30 మెడికల్ లీవ్‌లతో పాటు 15 రోజుల క్యాజువల్ లీవ్ (Casual Leaves)వంటి ప్రయోజనాలను పొందవచ్చు. అంతే కాకుండా ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌సూతి లేదా పితృత్వ సెల‌వుల‌ను పొంద‌వ‌చ్చు. స్కాల‌ర్‌షిప్ పూర్తి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ pgscholarship.aicte-india.org ను సంద‌ర్శించాలి.

ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హ‌త‌లు..

- 2021-22 విద్యా సంవత్సరంలో ఎంటెక్ (MTech), ఎంఫార్మసీ, ఎంఈ, మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ చదవాలనుకునేవారి ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు.

- గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్-GATE లేదా గ్రాడ్యుయేట్ ఫార్మసీ యాప్టిట్యూడ్ టెస్ట్-GPAT ద్వారా ఏఐసీటీఈ అప్రూవ్డ్ ఇన్‍స్టిట్యూట్స్‌లో చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు.

AIIMS Recruitment 2021 : ఎయిమ్స్ రాయ్‌బ‌రేలిలో 118 ఉద్యోగాలు.. అర్హ‌త‌, ద‌ర‌ఖాస్తు విధానం


- పీజీ స్కాల‌ర్‌షిప్ అద‌నంగా 10శాతం మంది ఈడ‌బ్ల్యూఎస్ (EWS) విద్యార్థుల‌కు అందిస్తారు. ఇది ఇన్‌స్టిట్యూట్ అడ్మిష‌న్‌ల ఆధారంగా ఉంటుంది.

- ఎంపికైన విద్యార్థులకు రూ.12,400 చొప్పున 24 నెలల్లో మొత్తం రూ.2,97,600 స్కాలర్‌షిప్ లభిస్తుంది.

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 :  పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Step 2 :  ముందుగా అధికారిక పోర్ట‌ల్ https://pgscholarship.aicte-india.org/ ను సంద‌ర్శించాలి.

Step 3 :  ఈ-మెయిల్ ఐడీతో పాస్‌వ‌ర్డ్ పెట్టుకొని రిజిస్ట‌ర్ చేసుకోవాలి.

Step 4 :  అనంత‌రం పూర్తి స‌మాచారం అందించాలి.

Step 5 :  ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన త‌రువాత స‌బ్‌మిట్ చేయాలి.

Step 6 :  ఈ స్కాల‌ర్‌షిప్‌ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 31, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

Step 7 :  ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే 011-29581119 ఫోన్ నంబ‌ర్‌తోపాటు PGSCHOLARSHIP@AICTE-INDIA.ORG ఈ-మెయిల్ ఐడీలో సంప్రదించొచ్చు.

HAL Recruitment 2021: హెచ్ఏఎల్‌లో పారామెడిక‌ల్ స్టాఫ్ ఉద్యోగాలు.. జీతం రూ.21,473


యూజీసీ కూడా అందిస్తోంది..

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ప్రకటించింది. వేర్వేరు విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్ అందించనుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన 1,000 మంది విద్యార్థులకు యూజీసీ స్కాలర్‌షిప్స్ లభిస్తాయి. టెక్నాలజీ, ఇంజనీరింగ్ (Engineering), మేనేజ్‌మెంట్, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్ కోసం దరఖాస్తు చేయొచ్చు.

మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్-ME, మాస్టర్స్ ఇన్ టెక్నాలజీ-MTech కోర్సులు చదివే వారికి నెలకు రూ.7,800, ఇతర పీజీ కోర్సులు చదివేవారికి నెలకు రూ.4,500 స్కాలర్‌షిప్ లభిస్తుంది. కోర్సులో చేరిననాటి నుంచి ఈ స్కాలర్‌షిప్స్ వర్తిస్తాయి. అయితే ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసేముందు విద్యార్థులు కొన్ని నియమనిబంధనల్ని గుర్తుంచుకోవాలి. యూజీసీ స్కాల‌ర్‌షిప్ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకొనే అభ్య‌ర్థులు https://scholarships.gov.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.

First published:

Tags: Scholarship, Students, UGC

ఉత్తమ కథలు