హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AICTE Saksham Scholarship: ఆ విద్యార్థులకు ఏఐసీటీఈ సాక్షం స్కాలర్‌షిప్.. ఎంపికైతే ఏటా రూ.50 వేలు స్టైఫండ్..

AICTE Saksham Scholarship: ఆ విద్యార్థులకు ఏఐసీటీఈ సాక్షం స్కాలర్‌షిప్.. ఎంపికైతే ఏటా రూ.50 వేలు స్టైఫండ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AICTE Saksham Scholarship:  ప్రతిభ ఉన్నా సరే ఆర్థిక స్థోమత లేక చాలా మంది విద్యార్థులు(Students), ముఖ్యంగా వికలాంగులు (Disabled) ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. అటువంటి వారికి సహకారం అందించేందుకు దేశంలోని అనేక ప్రతిష్టాత్మక సంస్థలు స్కాలర్​షిప్​లను అందజేస్తున్నాయి. ఈ జాబితాలో ఆల్​ ఇండియా కౌన్సిల్​ ఫర్​ టెక్నికల్ ఎడ్యుకేషన్​ (AICTE) కూడా ఉంది. తాజాగా ఈ సంస్థ సాక్షం స్కాలర్‌షిప్​ల దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.

ఇంకా చదవండి ...

ప్రతిభ ఉన్నా సరే ఆర్థిక స్థోమత లేక చాలా మంది విద్యార్థులు(Students), ముఖ్యంగా వికలాంగులు (Disabled) ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. అటువంటి వారికి సహకారం అందించేందుకు దేశంలోని అనేక ప్రతిష్టాత్మక సంస్థలు స్కాలర్​షిప్​లను అందజేస్తున్నాయి. ఈ జాబితాలో ఆల్​ ఇండియా కౌన్సిల్​ ఫర్​ టెక్నికల్ ఎడ్యుకేషన్​ (AICTE) కూడా ఉంది. తాజాగా ఈ సంస్థ సాక్షం స్కాలర్‌షిప్​ల దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులను అభ్యసించే వికలాంగుల (Disabled) నుంచి దరఖాస్తులు(Applications) ఆహ్వానిస్తోంది. ఈ సాక్షం స్కాలర్​షిప్​ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్వహిస్తోంది.

వికలాంగులను ఉన్నత విద్యలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ స్కాలర్​షిప్​ను ప్రతి ఏటా అందజేస్తోంది. ఏఐసీటీఈ ఆమోదించిన సంస్థల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్​ ఫస్టియర్​​ లేదా లేటరల్​ ఎంట్రీ ద్వారా సెకండియర్​ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్​షిప్​కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి సంవత్సరం రూ.50,000 స్టైఫండ్ అందజేస్తారు. ఇంజినీరింగ్​ పూర్తయ్యే నాలుగేళ్ల పాటు ఈ స్కాలర్​షిప్​ను అందిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

Bank of Maharashtra Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

సాక్షం స్కాలర్‌షిప్ ముఖ్యమైన వివరాలు

ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్​షిప్ దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తు చేసుకునే విద్యార్థి కుటుంబ వార్హిక ఆదాయం రూ. 8 లక్షలకు మించకూడదు. ఆన్‌లైన్​లో దరఖాస్తు చేసే సమయంలోనే ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి.

UBI Recruitment 2021: రూ.78,000 వేతనంతో యూనియన్ బ్యాంక్‌లో 347 ఉద్యోగాలు 

ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లోని డిప్లొమా/డిగ్రీ కోర్సుల్లో నేరుగా మొదటి సంవత్సరం లేదా లేటరల్​ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో ప్రవేశాలు పొందిన వికలాంగులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

NIT Warangal: రూ.500తో ఆన్ లైన్ కోర్సు.. అర్హత, దరఖాస్తు చేసుకునే వివరాలు ఇలా..

అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు ముందుగా నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP)లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థి చదువుతున్న కళాశాల ముందుగా ఆన్‌లైన్​లో వచ్చిన దరఖాస్తును ధ్రువీకరిస్తుంది. ఆ తర్వాత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సాంకేతిక విద్యా విభాగం (DTE) దరఖాస్తులను పరిశీలన చేస్తుంది.

ఆసక్తి గల అభ్యర్థులు 2021 నవంబర్ 30లోపు నేషనల్​ స్కాలర్​షిప్​ పోర్టల్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం ఎన్​ఎస్​పీ అధికారిక వెబ్​సైట్​ను సందర్శించాలి.

Published by:Veera Babu
First published:

Tags: Degree students, Scholarship, Students