Home /News /jobs /

AICTE REVISES ACADEMIC CALENDAR RELEASED CHECK FOR FIRST YEAR CLASSES AND REFUND RULES BA GH

విద్యార్థులకు అలర్ట్.. AICTE కొత్త అకడమిక్ క్యాలెండర్‌.. క్లాసులు ఎప్పటి నుంచి, సీట్లు రద్దు చేసుకుంటే డబ్బులు రీ ఫండ్ వస్తాయా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాజా అకడమిక్ ఇయర్‌కు (2022-23) సంబంధించిన రివైజ్డ్ అకడమిక్ సర్కూలర్‌ను విడుదల చేసింది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE). ఏఐసీటీఈ ఆమోదించిన ఇన్‌స్టిట్యూషన్స్, యూనివర్సిటీలకు ఈ క్యాలెండర్ వర్తిస్తుంది.

తాజా అకడమిక్ ఇయర్‌కు (2022-23) సంబంధించిన రివైజ్డ్ అకడమిక్ సర్కూలర్‌ను విడుదల చేసింది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE). ఏఐసీటీఈ ఆమోదించిన ఇన్‌స్టిట్యూషన్స్, యూనివర్సిటీలకు ఈ క్యాలెండర్ వర్తిస్తుంది. టెక్నికల్ కోర్సుల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. తరగతులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ లేదా బ్లెండెడ్ మోడ్‌లో (ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్)లో పాండమిక్ ప్రోటోకాల్‌ అనుసరించి నిర్వహించుకోవచ్చని ఏఐసీటీఈ తెలిపింది. కళాశాలలకు అనుమతి మంజూరు చేయడం లేదా తిరస్కరించడానికి తుది గడువు జులై 10గా ఏఐసీటీఈ నిర్ణయించింది. ఇక యూనివర్సిటీలు/బోర్డులకు అఫిలియేషన్ మంజూరు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 31. మరోవైపు, టెక్నికల్ కోర్సుల్లో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు తరగతులు సెప్టెంబర్ 15తో ముగియనున్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు అక్టోబర్ 20 లోపు తమ సీట్లను రద్దు చేసుకుంటే పూర్తి ఫీజు రిఫండ్ చేయనున్నారు.

కరోనా కారణంగా ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎడ్యుకేషన్/ హెల్త్/ హోమ్ మంత్రిత్వ శాఖలు ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా 2022-2023 అకడమిక్ క్యాలెండర్‌లోని తేదీలను మార్చడానికి తమకు అనుమతి ఉందని AICTE అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొంది.

JEE Main Result 2022: జేఈఈ మెయిన్స్ పర్సంటైల్ ఎలా చెక్ చేయాలి? టాప్ కాలేజీలు ఏవి?లెర్నర్ సెంట్రిక్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన క్యాలెండర్‌ను ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుధే లాంచ్ చేశారు. ఎమర్జింగ్ థ్రస్ట్ ఏరియాస్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్ బిల్డింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లలో అప్లికేషన్ నాలెడ్జ్‌ వంటి మెథడ్స్ ద్వారా విలువను పెంపొందించడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం.

IBPS Clerk Exam English Tips: ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే, ఈ టిప్స్ మీ కోసమే..ఇటీవల ఏఐసీటీఈ.. అకాడమీ ఆఫ్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ (ATAL), ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (FDP)కి సంబంధించిన క్యాలెండర్‌ను కూడా ప్రచురించింది. ఈ ఏటీఏఎల్ విద్యార్థులకు రియల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్, పరిశ్రమ పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన ఎఫ్‌డీపీలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రామ్స్ సబ్జెక్ట్ డొమైన్ నాలెడ్జ్, అసోసియేటెడ్ అనలిటికల్ స్కిల్స్ ప్రాధాన్యతను తెలియజేస్తాయి. కాగా, 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన FDP క్యాలెండర్‌ను కూడా ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుధే లాంచ్ చేశారు.మరోపక్క.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) స్థానంలో ఈ సంవత్సరం నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (HECI) ఉనికిలోకి రావచ్చు. ఈ మూడింటి స్థానంలో ఒకే ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది ఏర్పడవచ్చు. హెచ్ఈసీఐ (HECI) ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లు దాదాపు సిద్ధమైంది. ఇటీవల ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఓ ప్రముఖ దినపత్రిక వెల్లడించింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: EDUCATION, JOBS

తదుపరి వార్తలు