• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • AICTE RELEASES REVISED ACADEMIC CALENDAR 2021 CHECK DETAILS HERE MK GH

AICTE: ఇంజినీరింగ్​ విద్యార్థులకు అలర్ట్​.. అకడమిక్ క్యాలెండర్​ను విడుదల చేసిన ఏఐసీటీఈ

(ప్రతీకాత్మక చిత్రం)

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అకడమిక్ క్యాలెండర్​ను విడుదల చేసింది ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేష

  • Share this:
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అకడమిక్ క్యాలెండర్​ను విడుదల చేసింది ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE). ఇంజినీరింగ్​​, ఫార్మసీ​ కోర్సుల్లో 2021–22 విద్యా సంవత్సరానికి గాను సవరించిన క్యాలెండర్‌ను ప్రకటించింది. ఈ వివరాలను కౌన్సిల్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. దేశంలోని అన్ని వృత్తి విద్యా సంస్థలకు అనుమతులు మంజూరు చేసే ప్రక్రియ జూన్ 30 నాటికి పూర్తి చేస్తామని వెల్లడించింది. ఇంజినీరింగ్ టెక్నికల్ కోర్సుల్లో ఆగస్టు 31లోపు మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి చేస్తామని వెల్లడించింది. సెప్టెంబర్ 15 నుంచి బీటెక్​ మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఇక, మిగతా తరగతుల వారికి సెప్టెంబర్​ 1లోపే తరగతులను మొదలు పెట్టవచ్చని యూనివర్సిటీలకు సర్క్యులర్​ జారీ చేసింది.
కాగా, స్టాండ్ ​ఎలోన్​ పిజిడిఎం/ పిజిసిఎం విద్యాసంస్థల్లో మాత్రం ఆగస్టు 2 నుంచి తరగతులు ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. పిజిడిఎం / పిజిసిఎం కోర్సుల్లో ప్రవేశాలకు తొలుత జూలై 10 వరకు మాత్రమే గడువు ఉండగా.. దాన్ని ఆగస్ట్​ 11 వరకు పొడిగించింది.

ఇక, మరోవైపు, పీజీడీఎం/ పీజీసీఎం సంస్థల్లో ఓడిఎల్/ ఆన్‌లైన్ కోర్సును అందించాలనుకునే ఇన్​స్టిట్యూట్లు జూన్ 30లోపు ఏఐసీటీ అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది. మొదటి విడత రెగ్యులర్​, డిస్టెన్స్/ ఆన్‌లైన్ లెర్నింగ్ మోడ్‌ ప్రవేశాలు 2021 సెప్టెంబర్ 1లోపు పూర్తి చేస్తామని, రెండో విడత రెగ్యులర్​, డిస్టెన్స్​ ప్రవేశాలు 2022 ఫిబ్రవరి 1లోపు పూర్తి చేస్తామని వెల్లడించింది. బీఈ/బీటెక్​ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు 2021 సెప్టెంబర్ 15లోపు తరగతులు ప్రారంభించాలని అన్ని యూనివర్సిటీలను కోరింది.

సెప్టెంబర్​ 15 నుంచి ఇంజినీరింగ్​ తరగతులు..
దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ తగ్గుముఖం పట్టడంతో వీలైనంత త్వరగా అకడమిక్​ ఇయర్​ ప్రారంభించాలని ఏఐసీటీఈ భావిస్తోంది. అందుల్లే 2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి బీటెక్​ మొదటి సంవత్సరం క్లాసులను సెప్టెంబర్​ 15లోగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. అయితే, సెకండ్​, థర్ట్​, ఫైనలియర్​ విద్యార్థులకు మాత్రం సెప్టెంబర్​ 1లోపే క్లాసులు ప్రారంభించుకోవచ్చని తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను అంచనా వేసి ఆన్​లైన్​/ ఆఫ్​లైన్​ రెండు విధాలుగా క్లాసులను నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ వివరాలను తాజా అకడమిక్​ క్యాలెండర్​లో పొందుపర్చింది.
Published by:Krishna Adithya
First published: