Home /News /jobs /

Engineering Classes: ఇంజనీరింగ్ విద్యార్థులకు అలర్ట్.. క్లాసుల ప్రారంభం ఎప్పుడంటే..

Engineering Classes: ఇంజనీరింగ్ విద్యార్థులకు అలర్ట్.. క్లాసుల ప్రారంభం ఎప్పుడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒక వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం నేపథ్యంలో వివిధ పరీక్షలు ఆలస్యమవుతుంటే మరో వైపు అకాడమిక్ షెడ్యూల్ ను విడుదల చేసింది ఏఐసీటీఈ.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ తరగతులపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి తాజాగా కీలక ప్రకటన చేసింది. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి బీటెక్ మొదటి సంవత్సరం క్లాసులను సెప్టెంబర్ 15లోగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మిగతా విద్యార్థులకు సెప్టెంబర్ 1లోపు క్లాసులు ప్రారంభించుకోవచ్చని తెలిపింది. ఈ మేరు ఏఐసీటీఈ అకాడమిక్ క్యాలెండర్ ను తాజాగా విడుదల చేసింది. తరగతులను ఆన్ లైన్/ఆఫ్ లైన్ రెండు విధాలుగా నిర్ణయించుకోవచ్చని తెలిపింది ఏఐసీటీఈ. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ, హోంశాఖల ఆదేశాల మేరకు టైం టేబుల్ లో మార్పులు చేస్తామని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఒక వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంటూ మరో వైపు ఏఐసీటీఈ అకాడమిక్ క్యాలండర్ విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేఈఈతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయో తెలియని ఈ పరిస్థితుల్లో అకాడమిక్ క్యాలండర్ విడుదల చేయడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    ఏఐసీటీఈ అకాడమిక్ క్యాలెండర్


    ఏఐసీటీఈ విడుదల చేసిన టైం టేబుల్:
    కళాశాలలకు అనుమతుల మంజూరుకు ఆఖరి తేదీ: జూన్ 30
    యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వడానికి ఆఖరి తేదీ: జూలై: 15
    మొదటి విడుత సీట్ల కేటాయింపుకు ఆఖరి తేదీ: ఆగస్టు 31
    పాత విద్యార్థులకు క్లాసులు ప్రారంభించేందుకు ఆఖరి తేదీ: సెప్టెంబర్ 1
    రెండో విడుత కౌన్సెలింగ్ కు చివరి తేదీ: సెప్టెంబర్ 9
    సీట్ల రద్దుకు గడువు: సెప్టెంబర్ 10
    సెకండియర్ లోకి లేటర్ ఎంట్రీ అడ్మిషన్లకు చివరి తేదీ: సెప్టెంబర్ 20
    ప్రముఖ కంపెనీలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ కు రేపటి వరకే ఛాన్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
    SBI Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. SBIలో 5 వేలకు పైగా ఉద్యోగాలు.. అప్లికేషన్లకు మరి కొన్ని రోజులే గడువు

    ఇదిలా ఉంటే.. కరోనా నేపథ్యంలో జేఎన్టీయూ హైదరాబాద్(JNTUH) అధికారులు బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి సెమిస్టెర్(8వ సెమిస్టర్) పరీక్షలను ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలని భావిస్తున్నారు. గతేడాది సమీపంలోని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాసే అవకాశాన్ని యూనివర్సిటీ విద్యార్థులకు కల్పించింది. అయితే కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం అంత మంచిది కాదన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్నాలజీని ఉపయోగించుకుని ఆన్లైన్లోనే ఇంటి వద్ద నుంచి పరీక్షలు రాసే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించాలని అధికారులు యోచిస్తున్నారని తెలుస్తోంది. జూన్, జూలై నెలలో ఈ అంశంపై అధికారులు తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Classes, JNTUH, Online classes

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు