స్వయం ప్లాట్‌ఫారమ్ కోసం MOOC లను (మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు) అభివృద్ధి చేయడానికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ప్రతిపాదనలను ఆహ్వానించింది. సాంకేతిక ఉన్నత విద్యా సంస్థలకు చెందిన ఎడ్యుకేషన్ కంటెంట్ డెవలపర్లు, ఫ్యాకల్టీ సభ్యులు ప్రతిపాదనలు పంపాలని కోరింది. అలాగే కళాశాలు లేదా యూనివర్సిటీలతో సంబంధం లేని ఫ్రీలాన్సర్లు, ఇతర వ్యక్తులు సైతం ప్రతిపాదనలు పంపవచ్చని ఏఐసీటీఈ స్పష్టం చేసింది.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానోటెక్నాలజీ, బ్లాక్‌చెయిన్, క్వాంటం కంప్యూటింగ్, మిక్స్డ్ రియాలిటీ, డేటా అనలిటిక్స్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అండ్ ఇన్నోవేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వంటి వాటిపై మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులను అభివృద్ధి చేయటానికి AICTE ఈ ప్రక్రియ చేపట్టింది. వీటిలో అనధికారిక విద్యా వ్యవస్థ పరిధిలోకి వచ్చే అంశాలు కూడా ఉన్నాయి.
Jobs in Telangana: సింగరేణిలో ఉద్యోగాలు.. పరీక్ష లేదు.. మూడు రోజులు ఇంటర్వ్యూలు
ఆసక్తి ఉన్న అభ్యర్థులు AICTE విడుదల చేసిన అధికారిక నోటీసులో పేర్కొన్న ఇమెయిల్ చిరునామాకు పూర్తి ప్రతిపాదనను పంపాల్సి ఉంటుంది. ప్రతిపాదనను పంపడానికి చివరి తేదీ మే 15గా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే కోర్సు క్రియేటర్లు తమ కరిక్యూలమ్కు చెందిన ప్రతిపాదనను 3 నిమిషాల పరిచయ వీడియోతో పంపవలసి ఉంటుంది. ప్రతిపాదిత MOOCలో యూనిట్ వారీగా కంటెంట్లను క్రియేటర్లు 3000 పదాలకు మించకుండా వివరించాలి.
AICTE తన అధికారిక నోటీస్‌లో ఇలా పేర్కొంది. కోర్సు ఔత్సాహికులు ప్రతిపాదిత MOOCలోని 3000 పదాలకు మించకుండా యూనిట్ వారీగా విషయాలను వివరించే మూడు నిమిషాల పరిచయ వీడియో, పాఠ్యాంశాలతో పాటుగా తమ ప్రతిపాదనలను సైతం పంపవచ్చని స్పష్టం చేసింది. స్వయం ప్లాట్ ఫారం కోసం కొత్త ఆన్లైన్ కోర్సుల క్రియేషన్ ప్రతిపాదనను అంగీకరించడం లేదా తిరస్కరించే హక్కు తమకు ఉందని AICTE స్పష్టం చేసింది.
UGC: ఉన్నత విద్యపై యూజీసీ కీలక నిర్ణయం.. విద్యార్థులకు మరింత సౌలభ్యం
SWAYAM (స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్–లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్) ప్లాట్‌ఫారమ్ కోసం మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు (MOOCs) సెల్ఫ్ ఫేస్డ్ లేదా క్రెడిట్ కోర్సులుగా అభివృద్ధి చేయనున్నట్లు AICTE తెలిపింది. ప్రతిపాదనను పంపే ముందు క్రియేటర్లు తమ MOOC సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉందని నిర్ధారించుకున్న తరువాత ప్రతిపాదనను పంపాల్సి ఉంటుంది. పంపిన ప్రతిపాదన ఆమోదం లేదా తిరస్కరణపై తుది నిర్ణయం AICTE ఏర్పాటు చేసిన అకడమిక్ అడ్వైజరీ కౌన్సిల్ (AAC) తీసుకోనుంది.
TSPSC OTR: నిరుద్యోగులకు బిగ్ రిలీఫ్.. టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం
ఓపెన్ ఆన్లైన్ కోర్సులను హోస్ట్ చేయడం కోసం AICTE అభివృద్ధి చేసిన ప్రపంచంలోని అతిపెద్ద MOOC ప్లాట్‌ఫారమ్‌లలో SWAYAM ఒకటి. విద్యా విధానంలో యాక్సెస్, ఈక్విటీ, నాణ్యత అనే మూడు ప్రధాన సూత్రాలను సాధించే లక్ష్యంతో ఈ SWAYAM ప్లాట్‌ఫారమ్ రూపొందించింది. ఇది ఒక-స్టాప్ వెబ్, మొబైల్ ఆధారిత ఇంటరాక్టివ్ ఇ-కంటెంట్. ఉన్నత పాఠశాల నుండి యూనివర్సిటీల స్థాయి వరకు అన్ని కోర్సులను SWAYAM అందిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, New course, Online Education