ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు శుభవార్త. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్-AICTE ప్రగతి, సాక్షం పేరుతో స్కాలర్షిప్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ ముగిసింది. దీంతో ఏఐసీటీఈ అప్లికేషన్ డెడ్‌లైన్ డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఈ స్కాలర్షిప్కు అప్లై చేయలేని వారికి ఇంకా అవకాశం ఉంది. సరిగ్గా దరఖాస్తు చేయలేని విద్యార్థులు తిరిగి తమ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. దరఖాస్తు గడువు పొడిగించడంతో మొదటి లెవెల్ అప్లికేషన్ వెరిఫికేషన్ గడువు కూడా పొడిగించింది ఏఐసీటీఈ. 2021 జనవరి 15 లోగా మొదటి లెవెల్ అప్లికేషన్ వెరిఫికేషన్, 2021 జనవరి 31 నాటికి రెండో లెవెల్ అప్లికేషన్ వెరిఫికేషన్ పూర్తవుతుంది.
ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్షిప్ను అమ్మాయిలకు అందిస్తోంది. టెక్నికల్ ఎడ్యుకేషన్‌పై ఆసక్తి ఉన్న అమ్మాయిలకు రూ.3,00,000 వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. నెలకు కనీసం రూ.12,400 స్కాలర్షిప్ పొందొచ్చు. 2020-21 విద్యా సంవత్సరంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ, మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ చదువుతున్న అమ్మాయిలు ఈ స్కాలర్షిప్కు అప్లై చేయొచ్చు. అడ్మిషన్ సమయంలో గేట్, జీప్యాట్ స్కోర్ ఉండాలి. ఏఐసీటీసీ అప్రూవ్ చేసిన ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీల్లో చదవాలి. ఎంపికైన విద్యార్థినులకు నెలకు రూ.12,400 చొప్పున 24 నెలల్లో మొత్తం రూ.2,97,600 స్కాలర్షిప్ లభిస్తుంది. ఇక ఇప్పటికే ప్రగతి స్కాలర్షిప్ పొందుతున్న విద్యార్థినులు రెన్యువల్‌కు అప్లై చేయాల్సి ఉంటుంది.
ECIL Hyderabad Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో జాబ్స్... డిసెంబర్ 31 లాస్ట్ డేట్
Railway Jobs: ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాస్తున్నారా? ఈ రూల్ మీకు తెలుసా?
Last date for #online applications under:
👉#AICTE-#Pragati #scholarship scheme for #girl students
👉#AICTE-#Saksham #scholarship scheme for #specially-abled #students
....extended till 31st Dec, 2020.!!
Fresh Appl.:https://t.co/299SGc3sJ2
Renewal Appl.:https://t.co/jzcr6ySPW3 pic.twitter.com/QR1vIwxauC
— AICTE (@AICTE_INDIA) December 2, 2020
ఏఐసీటీఈ సాక్షం స్కాలర్షిప్ను దివ్యాంగులకు అందిస్తోంది. టెక్నికల్ డిగ్రీ, టెక్నికల్ డిప్లొమా కోర్సులు చేస్తున్న దివ్యాంగులు సాక్షం స్కాలర్షిప్కు అప్లై చేయొచ్చు. ప్రతిభ ఉన్న దివ్యాంగులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ స్కాలర్షిప్ అందిస్తోంది ఏఐసీటీఈ. సాక్షం స్కాలర్షిప్ స్కీమ్ ద్వారా నెలకు రూ.50,000 ఆర్థిక సహకారం పొందొచ్చు. 40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అప్లై చేయొచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8,00,000 లోపు ఉండాలి. ఏఐసీటీఈ ప్రగతి, ఏఐసీటీఈ సాక్షం స్కాలర్షిప్స్ వివరాలను విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https://aicte-india.org/ లో తెలుసుకోవచ్చు.
SBI Jobs 2021: ఎస్బీఐలో 489 మేనేజర్ జాబ్స్... అప్లై చేయండి ఇలా
Railway Jobs: రైల్వే జాబ్ మీ కలా? నైరుతి రైల్వేలో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు
విద్యార్థులు ముందుగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ https://scholarships.gov.in/ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో UGC / AICTE Schemes పైన క్లిక్ చేయాలి.
ఏఐసీటీఈ స్కాలర్షిప్కు సంబంధించిన వివరాలు ఉంటాయి.
దరఖాస్తు చేయడానికి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
ముందే రిజిస్టర్ చేసుకున్నట్టైతే లాగిన్ చేయాలి.
ఆ తర్వాత స్కాలర్షిప్ టైప్ సెలెక్ట్ చేయాలి.
బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ సహా అన్ని వివరాలు ఎంటర్ చేయాలి.
ఓటీపీ ఎంటర్ చేసి స్కాలర్షిప్ దరఖాస్తు పూర్తి చేయాలి.
అప్లికేషన్ ఐడీ ఎక్కడైనా సేవ్ చేసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, EDUCATION, JOBS, Scholarship