AICTE U-Turn: ఇంజినీరింగ్​ విద్యార్హతపై వెనక్కి తగ్గిన ఏఐసీటీఈ... ఇక రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం

AICTE U-Turn: ఇంజినీరింగ్​ విద్యార్హతపై వెనక్కి తగ్గిన ఏఐసీటీఈ... ఇక రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం (ప్రతీకాత్మక చిత్రం)

AICTE U-Turn | ఇంజినీరింగ్​ ప్రవేశాలకు ఇంటర్మీడియట్​లో మ్యాథ్స్​, ఫిజిక్స్​, కెమిస్ట్రీ సబ్జెక్టులను చదవడం తప్పనిసరి కాదని తీసుకున్న నిర్ణయంపై ఏఐసీటీఈ వెనక్కి తగ్గింది.

  • Share this:
సాధారణంగా ఇంజినీరింగ్​ విద్య అభ్యసించాలంటే ఇన్ని రోజులూ ఇంటర్మీడియట్​లో కచ్చితంగా మ్యాథ్స్​, ఫిజిక్స్​, కెమిస్ట్రీ సబ్జెక్టులను చదవడం తప్పనిసరి. ఎంపీసీ చదివితేనే ఇంజినీరింగ్ చేసే వీలుంటుందని.. ఎంత కష్టమైనా దాన్ని చదివేవారు విద్యార్థులు. అయితే, ఇకపై ఇంజినీరింగ్​ ప్రవేశాలకు ఇంటర్మీడియట్​లో మ్యాథ్స్​, ఫిజిక్స్​, కెమిస్ట్రీ సబ్జెక్టులను చదవడం తప్పనిసరి కాదని ఏఐసీటీఈ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. 2021–22 సంవత్సరానికి సంబంధించి ఏఐసీటీఈ విడుదల చేసిన హ్యాండ్ బుక్​లో కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. అయితే, ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో ఇప్పుడు మళ్లీ వెనక్కు తగ్గింది. ఇంటర్మీడియట్​లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను చదవని విద్యార్థులను ఆయా ఇంజినీరింగ్​ కోర్సుల్లో చేర్చుకోవాలా? లేదా? అనేది ఆయా రాష్ట్రాలు/యూనివర్సిటీల ఇష్టమని తెలిపింది. ఇది తప్పనిసరి నిబంధన ఏమీ కాదని స్పష్టం చేసింది. విద్యార్థుల అర్హత విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు/యూనివర్సిటీలు తీసుకునే నిర్ణయమే ఫైనల్​ అని పేర్కొంది.

అయితే, బయోటెక్నాలజీ, టెక్స్‌టైల్ లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వంటి స్ట్రీమ్‌లను ఎంచుకునే విద్యార్థులు మాత్రం ఇంటర్మీడియట్​లో మ్యాథ్స్​, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను చదవకపోయినా సరే ఇంజినీరింగ్​లో చేరవచ్చని తెలిపింది. దీనిపై ఎఐసీటీఈ చైర్‌పర్సన్ అనిల్ సహస్రబుద్ధ మాట్లాడుతూ "మెకానికల్ ఇంజనీరింగ్ వంటి కోర్​ ఇంజనీరింగ్ బ్రాంచులను అభ్యసించడానికి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు చాలా ముఖ్యం. అందువల్ల, ఈ కోర్సుల విషయంలో గతేడాది అర్హత నిబంధనలే అమల్లో ఉంటాయి. అయితే, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ లేదా బయోటెక్నాలజీ వంటి స్ట్రీమ్‌లలో చేరే విద్యార్థులకు మాత్రం ఇంటర్మీడియట్​లో మ్యాథ్స్​, ఫిజిక్స్​, కెమిస్ట్రీ సబ్జెక్టులు తప్పనిసరి కాదు. వారు ఇంటర్మీడియట్​లో ఫిజిక్స్​, కెమిస్ట్రీ, మ్యాథ్స్​, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్, బయోటెక్నాలజీ, టెక్నికల్​ ఒకేషన​ల్​ సబ్జెక్ట్​, ఇంజినీరింగ్​ గ్రాఫిక్స్​, బిజినెస్​ స్టడీస్​, ఎంటర్​ప్రెన్యూర్​షిప్​ వంటి 14 సబ్జెక్టుల్లో ఏవైనా మూడు సబ్జెక్టుల్లో కనీసం 45 శాతం మార్కులు సాధిస్తే చాలు అర్హత సాధించినట్లేనని పేర్కింది.

Student Credit Cards: విద్యార్థులకూ ప్రత్యేక క్రెడిట్​ కార్డులు... లాభాలివే

Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 56 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

మాతృభాషలో ఇంజినీరింగ్​పై ఏఐసీటీఈ సర్వే


ఈ నిర్ణయంపై ఏఐసీటీఈ చైర్​పర్సన్​ అనిల్​ సహస్రబుద్ద స్పందిస్తూ "ఇంజినీరింగ్​కు కీలకమైన మాథ్స్​, ఫిజిక్స్​, కెమిస్ట్రీ, ఇంజినీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్టులను ఇంటర్​లో చదవని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని ఆయా యూనివర్సిటీలను కోరుతున్నాం. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ సబ్జెక్టులపై అవగాహన పెంచుకునేందకు ఈ బ్రిడ్జి కోర్సు ఉపయోగపడుతుంది. తద్వారా వారు కూడా మిగతా విద్యార్థులతో సమానంగా రాణించగలుగుతారు.”అని అన్నారు. ఇదిలా ఉంటే, ఇంజినీరింగ్​ విద్యను ఇంగ్లిష్​తో పాటు మాతృభాషల్లో కూడా అందించాలని ఏఐసీటీఈ తాజాగా నిర్ణయించింది. భారతీయ భాషల్లో సాంకేతిక విద్యను అందించాలన్న లక్ష్యానికి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రాంతీయ భాష్లలో ఇంజనీరింగ్ కోర్సులను ప్రవేశపట్టాలని యోచిస్తోంది.

Infosys: డిగ్రీ లేకపోయినా ఈ సర్టిఫికెట్ ఉన్నవారికి ఇన్ఫోసిస్‌లో 500 ఉద్యోగాలు

NTA Recruitment 2021: ఇంటర్, డిగ్రీ, పీజీ పాస్ అయ్యారా? 1145 ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

తాజాగా, ఈ నిర్ణయంపై ఏఐసీటీఈ ఇటీవల ఒక సర్వే కూడా నిర్వహించింది. ప్రస్తుతం బీఈ/ బీటెక్​ రెండు, మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై ఈ సర్వే కొనసాగింది. సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం మంది మాతృభాషలో ఇంజినీరింగ్​ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. తమిళనాడు నుండి మెజారిటీ విద్యార్థులు తమకు తమిళంలోనే చదువుకునే అవకాశం ఉంటే బాగుంటుందని తెలిపారు. ఆ తర్వాత హిందీలో, తెలుగు, మరాఠీ, కన్నడ భాషల విద్యార్థులు మాతృభాషలోనే విద్యాభోధన ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Published by:Santhosh Kumar S
First published: