AICTE Scheme for Girls: బాలిక‌ల‌కు సంవ‌త్స‌రానికి రూ.50,000 స్కాల‌ర్‌షిప్‌

(ప్రతీకాత్మక చిత్రం)

దేశంలో బాలిక‌ల విద్య, అభ్యున్న‌తికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ప్ర‌గ‌తి ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టింది. ఈ ప‌థ‌కం ద్వారా దేశంలో ఏఐసీటీఈ అనుబంధ విద్యాసంస్థ‌ల్లో అర్హులైన 5,000 మంది మ‌హిళా విద్యార్థుల‌కు ఆర్థిక‌సాయం అందించ‌నుంది.

  • Share this:
    దేశంలో బాలిక‌ల విద్య, అభ్యున్న‌తికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ప్ర‌గ‌తి ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టింది. ఈ ప‌థ‌కం ద్వారా దేశంలో ఏఐసీటీఈ అనుబంధ విద్యాసంస్థ‌ల్లో అర్హులైన 5,000 మంది మ‌హిళా విద్యార్థుల‌కు ఆర్థిక‌సాయం అందించ‌నుంది. డిగ్రీ, డిప్ల‌మా కోర్సు చేసే మ‌హిళ‌ల‌కు కోర్సు ప‌రిధి ఉన్న సంవ‌త్స‌రాలు ప్ర‌తీ ఏటా రూ.50,000వేలు అందించనుంది. ఈ 5,000 స్కాల‌ర్‌షిప్‌లే కాకుండా అండమాన్ మరియు నికోబార్ దీవులు, జమ్మూ మరియు కాశ్మీర్, లడఖ్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు దియు, లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ ప్రాంతాల నుంచి ద‌ర‌ఖాస్తు చేసుకొన్న మ‌హిళ‌ల్లో అర్హుల‌కు కూడా ఏఐసీటీఈ స్కాల‌ర్‌షిప్ అందించ‌నుంది.
    ఎంపికైన విద్యార్థినికి ప్రతి సంవత్సరం అధ్యయనం కోసం రూ. 50,000 చెల్లిస్తారు, ఇది మొదటి సంవత్సరం ప్రవేశించిన విద్యార్థులకు గరిష్టంగా మూడు సంవత్సరాలు మరియు రెండవ సంవత్సరానికి గరిష్టంగా రెండు సంవత్సరాలు డిప్లొమా విద్యార్థులకు పార్శ్వ ప్రవేశం ద్వారా గరిష్టంగా రెండు సంవత్సరాలు డిప్ల‌మా విద్యార్థుల‌కు గ‌రిష్టంగా రెండేళ్లు స్కాల‌ర్‌షిప్ అందిస్తారు.
    ఎవ‌రు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు..
    - స్కాల‌ర్‌షిప్ పొందే కుటుంబంలో గ‌రిష్టంగా ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు మాత్ర‌మే ఉండాలి.
    - ఏఐసీటీ ఆమోదం పొందిన డిప్లొమా స్థాయి కోర్సులో మొద‌టి సంవ‌త్సరం లేదా డిప్లొమా స్థాయి కోర్సులో రెండో సంత్స‌రం చ‌దువుతుండాలి.
    - కుటుంబ ఆదాయం సంవ‌త్స‌రానికి రూ.8ల‌క్ష‌లు దాటి ఉండ‌కూడ‌దు. దీనిక సంబంధించిన ఇన్‌క‌మ్ స‌ర్టిఫికెట్ రాష్ట్ర ప్రభుత్వం వ‌ద్ద పొంది ఉండాలి.
    ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి..
    - నేష‌న‌ల్ స్కాల‌ర్‌షిప్ పోర్టల్‌(ఎన్ఎస్‌పీ)లో న‌వంబ‌ర్ 30, 2021లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
    - ద‌ర‌ఖాస్తులో ఏవైనా త‌ప్పులు జ‌రిగినా, పొర‌పాట్లు ఉన్నా స‌రి చేసుకొనేందుకు డిసెంబ‌ర్ 15, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    - ఈ ద‌ర‌ఖాస్తుల‌ను రాష్ట్రానికి చెందిన‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ ప‌రిశీలించి ధ్రువీక‌రిస్తుంది.
    - స్కాల‌ర్‌షిప్ పొందేందుకు క‌చ్చితంగా బ్యాంక్ ఖాతా, విద్యా ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.
    - ఈ ప‌థ‌కం మ‌రింత స‌మాచారం తెల‌సుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్‌లో బ్రొచ‌ర్‌ను చూడాలి.

    ద‌ర‌ఖాస్తు చేసేందుకు క్లిక్ చేయండి
    Published by:Sharath Chandra
    First published: