Home /News /jobs /

AIATSL RECRUITMENT 2019 AIR INDIA AIR TRANSPORT SERVICES LIMITED NOTIFICATION FOR 46 POSTS KNOW WALK IN INTERVIEW DETAILS SS

Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
(ప్రతీకాత్మక చిత్రం)

Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ (ప్రతీకాత్మక చిత్రం)

AIATSL Recruitment 2019 | దరఖాస్తు ఫామ్, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. తమిళనాడులోని తిరుచ్చిలో 2019 డిసెంబర్ 15న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి.

    ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్-AIATSL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. కస్టమర్ ఏజెంట్, హ్యాండీమ్యాన్ / హ్యాండీవుమెన్, ర్యాంప్ సర్వీస్ ఏజెంట్, యుటిలిటీ కమ్ ర్యాంప్ డ్రైవర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. దక్షిణాది ప్రాంతంలోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం 46 ఖాళీలున్నాయి. ఇవి మూడేళ్ల కాంట్రాక్ట్ పోస్టులు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫామ్, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. నాన్ రీఫండబుల్ ఫీజు రూ.500 డీడీ తీయాల్సి ఉంటుంది. తమిళనాడులోని తిరుచ్చిలో 2019 డిసెంబర్ 15న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి.

    AIATSL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 46
    కస్టమర్ ఏజెంట్- 17
    హ్యాండీమ్యాన్ / హ్యాండీవుమెన్- 23
    ర్యాంప్ సర్వీస్ ఏజెంట్- 2
    యుటిలిటీ కమ్ ర్యాంప్ డ్రైవర్- 4
    విద్యార్హత-
    కస్టమర్ ఏజెంట్ పోస్టుకు 10+2+3 ప్యాటర్న్‌లో డిగ్రీ పాస్ కావాలి. కంప్యూటర్ ఆపరేషన్స్‌లో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి.
    హ్యాండీమ్యాన్ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి. ఇంగ్లీష్ భాష అర్థం చేసుకోవాలి.
    ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ పోస్టుకు మెకానికల్ / ఎలక్ట్రికల్ / ప్రొడక్షన్ / ఎలక్ట్రానిక్స్ / ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా ఆటో ఎలక్ట్రికల్ / ఎయిర్ కండీషనింగ్ / డీజిల్ మెకానిక్ / బెంచ్ ఫిట్టర్ / వెల్డర్‌ విభాగాల్లో NCTVT తో ఐటీఐ (మొత్తం మూడేళ్లు) ఉండాలి.
    యుటిలిటీ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టుకు 10వ తరగతి, HMV డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
    వయస్సు- జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 33 ఏళ్లు.
    ఫీజు- రూ.500. ఎక్స్ సర్వీస్‌మెన్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
    ఇంటర్వ్యూ జరిగే స్థలం:
    BBOT MARCEL RC Higher Secondary School,
    SEMBATTU, Airport (Post) Tiruchirappalli,
    Tamil Nadu – 620007.

    ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ 5ఎస్ ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Andhra Pradesh jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు... దరఖాస్తు లింక్ ఇదే

    SAIL Jobs: స్టీల్ అథారిటీలో 399 మేనేజ్‌మెంట్ ట్రైనీ జాబ్స్... నోటిఫికేషన్ డీటైల్స్

    Power Grid Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

     
    First published:

    Tags: Air India, Airlines, Airport, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు