హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AIASL Recruitment 2023: ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. పది, ఇంటర్, డిగ్రీ అర్హత..

AIASL Recruitment 2023: ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. పది, ఇంటర్, డిగ్రీ అర్హత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AIASL Recruitment 2023: AI ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పలు పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరింది. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు .. చివరి తేదీ ఏమిటి..? అలాగే ఎంపిక ఎలా జరుగుతుందో తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

AI ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(Air Port Service Limited) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. AI రవాణా సేవలను గతంలో ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ అని పిలిచేవారు. ఈ పోస్టులకు అర్హులైన మరియు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్రౌండ్ డ్యూటీలకు(Ground Duty) దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్(Contract) ప్రాతిపదికన ఉంటాయి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (Recruitment Drive) ద్వారా వివిధ రంగాలకు చెందిన మొత్తం 166 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీ పోస్టుల వివరాలు

కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 11 పోస్టులు

జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 25 పోస్టులు

యుటిలిటీ ఏజెంట్ & ర్యాంప్ డ్రైవర్ - 7 పోస్ట్‌లు

అప్రెంటిస్ - 45 పోస్టులు

అప్రెంటిస్ - 36 పోస్టులు

అప్రెంటిస్ (క్లీనర్) - 20 పోస్టులు

డ్యూటీ ఆఫీసర్ - 6 పోస్టులు

జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ - 4 పోస్టులు

జూనియర్ ఆఫీసర్ ప్యాసింజర్ - 12 పోస్టులు

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి విద్యార్హత పోస్టును బట్టి భిన్నంగా ఉంటుంది. 10వ తరగతి మరియు 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో పాటు సంబంధిత విభాగంలో డిగ్రీ కూడా ఉండాలి.

పరీక్ష లేకుండా ఎంపిక..

ఈ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. అంటే.. అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్షకు హాజరుకానవసరం లేదు. ఈ పోస్ట్‌ల కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ 07 ఫిబ్రవరి 2023 నుండి నిర్వహించబడుతుంది. 07 ఫిబ్రవరి నుండి 13 ఫిబ్రవరి 2023 వరకు ఈ ఇంటర్వ్యూలు ఉంటాయి.

AP-TS Postal Jobs: పోస్టల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఏపీలో 2480, తెలంగాణలో 1266 పోస్టులు ఖాళీ..

దరఖాస్తు ఫీజు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజులు జనరల్ కేటగిరీకి సంబంధించినవి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. వయో పరిమితి విషయానికి వస్తే.. జనరల్ కేటగిరీకి 28 ఏళ్లు, ఓబీసీకి 31 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 33 ఏళ్లుగా వయోపరిమితిని నిర్ణయించారు. పూర్తి వివరాలకు aiasl.in ని సందర్శించవచ్చు.

First published:

Tags: Ai jobs, Airport jobs, Central Government Jobs, JOBS

ఉత్తమ కథలు