AIAPGET 2021: పీజీ ఆయుష్ కోర్సులకు దరఖాస్తులు షురూ.. ముఖ్యమైన తేదీలు ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

ఆల్​ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్​ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ ఎగ్జామ్ దరఖాస్తు తేదీలు విడుదలయ్యాయి.

  • Share this:
ఆల్​ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్​ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ ఎగ్జామ్ దరఖాస్తు తేదీలు విడుదలయ్యాయి. ఆగస్టు 1 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ మొదలైపోయింది. 2021-22 విద్యాసంవత్సరానికి ఎన్​టీఏ అప్లికేషన్లను ఆహ్వానించింది. ఆగస్టు 1న దరఖాస్తుల ప్రక్రియ మొదలుకానుండగా.. ఆగస్టు 21తో ముగియనుంది. పరీక్షల తేదీ ఇంకా ఖరారు కాలేదు. దరఖాస్తు ప్రక్రియ ముగిశాక ఎగ్జామ్ డేట్ రానుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్​కు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్​ఏటీ విడుదల చేసింది. aiapget.nta.ac.in వెబ్​సైట్ ద్వారా ప్రవేశ పరీక్షకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు ఇవే..

దరఖాస్తు ప్రక్రియ మొదలు : ఆగస్టు 1, 2021
దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేదీ: ఆగస్టు 21, 2021 సాయంత్రం 5 గంటల వరకు
ఫీజు చెల్లింపునకు తుది గడువు: ఆగస్టు 21, 2021 రాత్రి 11.50 వరకు
అప్లికేషన్ల సవరణ: ఆగస్టు 23 నుంచి 25 వరకు, 2021

దరఖాస్తులో వివరాలను అభ్యర్థులు చాలా జాగ్రత్తగా నింపాలి. చివరి నిమిషంలో సర్వర్లు స్లో అవ్వడం, హడావుడికి గురికాకుండా చివరి తేదీ కంటే చాలా ముందే దరఖాస్తు చేసుకోవడం చాలా మంచిది. అలాగే దరఖాస్తు పూర్తయ్యాక కూడా ఏవైనా తప్పులున్నాయా అని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి.

అప్లై చేయండిలా..
ముందుగా aiapget.nta.ac.in వెబ్​సైట్​లోకి వెళ్లాలి. ఆ తర్వాత ఏఐఏపీజీఈటీ 2021 అనే టెక్స్ట్​ ఉన్న లింక్​పై క్లిక్ చేయాలి. అప్పుడు బ్రౌజర్​లో ఓ కొత్త విండోలో దరఖాస్తు ఓపెన్​ అవుతుంది. అక్కడ పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అన్నింటినీ సరిచూసుకోవాలి. పూర్తయ్యాక సబ్మిట్ బటన్​పై క్లిక్ చేయాలి. అప్పుడు వచ్చే అప్లికేషన్ ఫామ్​ను డౌన్​లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్తులో అడ్మిట్ కార్డు సహా వివిధ సమయాల్లో ఈ నంబర్ ఉపయోగపడుతుంది. ఎంట్రన్ ఎగ్జామ్ తేదీలు, పరీక్ష కేంద్రం వివరాలన్నీ తర్వాత జారీ చేసే అడ్మిట్ కార్డులో ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక అడ్మిట్ కార్డులు ఎప్పుడు ఇచ్చేది ఎన్​టీఏ ప్రకటిస్తుంది.

కాగా ఈ ఆయుష్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ 120 నిమిషాలు పాటు ఉంటుంది. మొదటి షిఫ్ట్​లో ఆయుర్వేదానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అలాగే రెండో షిఫ్ట్​లో హోమియోపతి, సిద్ధ, యునాని విభాగాల క్వశ్చన్స్ ఉంటాయి. హోమియోపతి పరీక్ష ఇంగ్లిష్​లో మాత్రమే ఉండనుండగా.. ఆయుర్వేద పరీక్ష ఇంగ్లీష్​, హిందీ, సిద్ధ ఇంగ్లీ​ష్​, తమిళం, యునాని ఇంగ్లిష్​, ఉర్దూల్లో ఉండనుంది. దరఖాస్తు సమయంలోనే ఏ భాషలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నది జాగ్రత్తగా ఎంటర్ చేయాలి.
Published by:Sumanth Kanukula
First published: