హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AI Skills: ఏఐ ప్రొఫెషనల్స్‌కు పెరుగుతున్న అవకాశాలు.. ఇతర ఉద్యోగాలతో పోలిస్తే ఎక్కువ శాలరీ

AI Skills: ఏఐ ప్రొఫెషనల్స్‌కు పెరుగుతున్న అవకాశాలు.. ఇతర ఉద్యోగాలతో పోలిస్తే ఎక్కువ శాలరీ

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

AI Skills | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి చెందిన నిపుణులు, డేటా సైంటిస్ట్‌ల కొత్త జీతంపై చేపట్టిన ఒక సర్వేలో ఆసక్తికరమైన వివరాలు తెలిశాయి. డేటా విశ్లేషణ నైపుణ్యాలు, అనుభవం ఉన్న వారి జీతాల వార్షిక పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది.

ఇంకా చదవండి ...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence)  రంగానికి చెందిన నిపుణులు, డేటా సైంటిస్ట్‌ల కొత్త జీతంపై చేపట్టిన ఒక సర్వేలో ఆసక్తికరమైన వివరాలు తెలిశాయి. డేటా విశ్లేషణ నైపుణ్యాలు, అనుభవం ఉన్న వారి జీతాల వార్షిక పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది. 2021 మే నుంచి మే 2022 మే వరకు నిర్వహించిన 1,841 డేటా నిపుణుల (1,265 డేటా సైంటిస్ట్‌లు, 576 ఏఐ ప్రొఫెషనల్స్) బర్చ్‌వర్క్స్ (Burtch works) సర్వేలో.. అన్ని ఉద్యోగ స్థాయిలలో అతిపెద్ద జీతం పెరుగుదలను చూసినట్లు పేర్కొంది.

NEET: నీట్ అభ్యర్థులకు అలర్ట్.. మరోసారి అప్లికేషన్ ఎడిట్ విండో ఓపెన్.. ఎగ్జామ్ వాయిదా పడుతుందా?

ఈ కాలంలో ఏఐ ప్రొఫెషనల్స్‌కు సగటు మూల వేతనాలలో పెరుగుదల లెవల్‌ 1 ఇండివిడ్యువల్ కంట్రిబ్యూటర్స్‌కు 11 శాతం, లెవల్‌ 3 మేనేజర్‌లకు 10 శాతం, లెవల్ 1 డేటా సైంటిస్ట్ ఇండివిడ్యువల్ కంట్రిబ్యూటర్‌కు 13 శాతం, లెవల్ 3 డేటా సైంటిస్ట్ మేనేజర్‌కి 10 శాతం వరకు ఉందని సర్వే స్పష్టం చేసింది.

నివేదిక ప్రకారం.. విస్తృతమైన అనుభవం ఉన్న వృత్తి నిపుణుల కోసం వెతుకుతున్న కంపెనీలు, ఇంటర్నల్ టీమ్‌లను సమర్ధవంతంగా నిర్వహించే ప్రాధాన్యత కారణంగా మేనేజిరియల్‌ స్కిల్స్‌ ఉన్నవారికి అవకాశాలు కల్పిస్తున్నాయి. వ్యక్తిగత సహకారులుగా డేటా శాస్త్రవేత్తలకు (Data Scientists)  మధ్యస్థ మూల వేతనం లెవల్‌ 1 వ్యక్తిగత కంట్రిబ్యూటర్‌కు 90,000 డాలర్ల నుంచి లెవల్ 3 వ్యక్తిగత కంట్రిబ్యూటర్‌కు 145,000 డాలర్ల వరకు ఉంటుంది.

TSSPDCL Recruitment 2022: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. విద్యుత్ శాఖలో 201 ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తులు ప్రారంభం

డేటా సైన్స్ మేనేజర్‌ల కోసం, అనుభవ స్థాయిని బట్టి మధ్యస్థ మూల వేతనం 155,000 డాలర్ల నుంచి 275,000 డాలర్ల వరకు ఉంటుంది. లెవల్ 3లో డేటా సైన్స్ (Data Science) మేనేజర్‌కి మూల వేతనంలో 75వ శాతం 310,000 డాలర్లు, వార్షిక పెరుగుదల 13 శాతంగా ఉంటుంది.

ఇండివిడ్యువల్ కంట్రిబ్యూటర్స్‌గా ఏఐ నిపుణులకు మధ్యస్థ మూల వేతనం లెవల్‌ 1 ఇండివిడ్యువల్ కంట్రిబ్యూటర్‌కు 105,000 డాలర్ల నుంచి లెవల్ 3 ఇండివిడ్యువల్ కంట్రిబ్యూటర్స్‌కు 175,000 డాలర్ల వరకు ఉంటుంది. ఏఐ మేనేజర్‌ల కోసం, అనుభవ స్థాయిని బట్టి మధ్యస్థ మూల వేతనం 167,000 డాలర్ల నుంచి 275,000 డాలర్ల వరకు ఉంటుంది. లెవల్‌ 3 వద్ద ఏఐ మేనేజర్‌కు మూల వేతనంలో 75వ శాతం 300,225 డాలర్లు, వార్షిక పెరుగుదల 9 శాతం ఉంటుంది.

Jobs in Aadhar: హైద‌రాబాద్ యూఐడీఏఐలో రూ.9ల‌క్ష‌ల ప్యాకేజీతో జాబ్స్‌.. అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

బర్చ్‌వర్క్స్ నివేదిక 2013 నుండి ఏటా ప్రచురితమవుతోంది. డేటా విశ్లేషణ నిపుణుల నుంచి అవసరమైన నైపుణ్యాల అప్‌గ్రేడ్‌ను దగ్గరగా అనుసరించింది. డేటా, యజమానులు, నిపుణులతో సంభాషణలు డేటా సైన్స్, ఏఐ నియామకం పటిష్టంగా ఉన్నాయని సూచిస్తున్నాయని Burtchworks పేర్కొంది. కానీ ఉద్యోగాల ఫ్రీజ్‌లు, లేఆఫ్‌ల ఇటీవలి మొదటి సంకేతాలను బట్టి, సమీప భవిష్యత్తు గురించి బర్చ్‌వర్క్స్ హెచ్చరించింది.

ఈ అనిశ్చిత సమయాలు అనేక పరిశ్రమలలో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. చిన్న, కొత్త కంపెనీలకు నిధులు మందగించాయి. వడ్డీ రేటు పెరుగుదల ఆర్థిక సేవల సంస్థలపై ప్రభావం చూపుతుంది. అదేవిధంగా ద్రవ్యోల్బణం, రిటైల్, తయారీ సంస్థలను దెబ్బతీస్తోంది. అయితే సరఫరా గొలుసు సమస్యలు సాంకేతిక సంస్థలపై ప్రభావం చూపుతున్నాయి. మార్కెట్లో ఈ ముఖ్యమైన మార్పులను పర్యవేక్షించడం కొనసాగిస్తామని Burtchworks తెలిపింది.

Published by:Sharath Chandra
First published:

Tags: Artificial intelligence, Career and Courses, EDUCATION, JOBS

ఉత్తమ కథలు