అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఏఐసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్ మెంట్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా 40 పోస్టులను నియమించున్నారు. దీనిలో రూరల్ మేనేజ్‌మెంట్(Rural Management), లా విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు..
వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అగ్రికల్చర్ మార్కెటింగ్/ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్/ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్/ రూరల్ మేనేజ్‌మెంట్/ లా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ / ఎంబీఏ(రూరల్ మేనేజ్‌మెంట్/ అగ్రికల్చర్ మార్కెటింగ్/ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్/ అగ్రి-బిజినెస్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్)/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (రూరల్ మేనేజ్‌మెంట్/అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్/ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు..
అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 06, 2023గా నిర్ణయించారు.
వయోపరిమితి..
అభ్యర్థుల యొక్క వయస్సు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలక రూ.60,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం
అభ్యర్థులకు ఆన్‌లైన్ పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షలో రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 135 నిమిషాలు. మొత్తం 150 మార్కులకు ఉంటుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పరీక్ష కేంద్రాలు కేటాయించారు. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మంలో పరీక్ష కేంద్రాలు ఉండగా.. ఏపీలో విజయవాడ , విశాఖపట్నంలో పరీక్ష సెంటర్లు ఉండనున్నాయి. ఈ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన వారిని ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం..
అభ్యర్థులకు పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు. ఏప్రిల్ లేదా మే నెలలో ఈ పరీక్ష ఉండనుంది.
దరఖాస్తు విధానం ఇలా..
-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
-దీనిలో కెరీర్ ట్యాబ్ పై క్లిక్ చేసి.. మెనేజ్ మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
-కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో ఆన్ లైన్ దరఖాస్తుల సమర్పణపై క్లిక్ చేయండి.
-దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసి.. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, JOBS