అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ (Army Agniveer Rally Recruitment) నోటిఫికేషన్ విడుదలైనట్లు గుంటూరులోని బ్రాంచ్ రిక్రూటింగ్ కార్యాలయం తెలిపింది. ది. 2023-24కి సంబంధించి అగ్నివీరుల నియామకం చేపట్టనున్నట్లు వెల్లడించింది. మార్చి 15వ తేదీ లోపు రిజిస్ట్రేషన్‌కు అవకాశముందని... ఏప్రిల్ 17న పరీక్ష జరుగుతుందని తెలిపింది. కర్నూలు, నెల్లూరు, అనంతపురం, కడప, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఔత్సాహికులు.. ‘జాయిన్‌ఇండియన్‌ఆర్మీ.ఎన్‌ఐసీ.ఇన్ (joinindianarmy.nic.in)’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తు ఫీజు రూ.250 చెల్లించాలి.
Career In Agriculture Sector: వ్యవసాయ రంగంలో అద్భుత అవకాశాలు.. నెలకు రూ.50 వేల జీతం..
అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మన్ (10వ తరగతి ఉత్తీర్ణత), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (8వ తరగతి ఉత్తీర్ణత) పోస్టులకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. కనీస విద్యార్హత , వయో పరిమితిని పూర్తి చేసిన యువకులు ఈ పథకం కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేస్తున్నప్పుడు అభ్యర్థులందరూ తప్పనిసరిగా వారి వ్యక్తిగత మొబైల్ నంబర్ చేయాల్సి ఉంటుంది. అగ్నివీరుల రిక్రూట్‌మెంట్ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష.. రెండో దశలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తారు. చివరగా మెడికల్ పరీక్ష నిర్వహిస్తారు.
CUET 2023 Admissions: సీయూఈటీ-2023లో కీలక మార్పులు.. వెల్లడించిన చైర్మన్..
దేశ భద్రతను పటిష్టం చేసేందుకు, యువతకు సైనిక సేవలో అవకాశం కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చిన్నట్లు కేంద్రం ఇది వరకే చెప్పిన విషయం తెలిసిందే. ఈ పథకం వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పేర్కొంది. సర్వీసులో ఉన్న నైపుణ్యాలు, అనుభవంతో వారికి వివిధ రంగాల్లో ఉద్యోగాలు కూడా లభిస్తాయని వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agniveer, Guntur, Indian Army, Local News