Home /News /jobs /

AGNIVEER INDIAN NAVY PREPARATION TIPS YOU FOLLOW THIS PLAN THE SCALE IS YOURS AND KNOW THE PREPARATION TIPS VSP VB

Agniveer Preparation Tips: అగ్నివీర్ ఇండియన్ నేవీ ప్రిపరేషన్ టిప్స్.. ఈ ప్రణాళిక ఫాలో అయితే కొలువు మీ సొంతం..

 అగ్నివీర్ ఇండియన్ నేవీ ప్రిపరేషన్ టిప్స్.. ఈ ప్రణాళిక ఫాలో అయితే కొలువు మీ సొంతం..

అగ్నివీర్ ఇండియన్ నేవీ ప్రిపరేషన్ టిప్స్.. ఈ ప్రణాళిక ఫాలో అయితే కొలువు మీ సొంతం..

దేశ రక్షణ శాఖలోని త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో చేరి దేశ సేవలో పాలు పంచుకోవాలన్న యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్‌ స్కీమ్‌ ద్వారా అగ్నివీర్ లను నియమించనుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  (P. Anand Mohan, News 18, Visakhapatnam)

  దేశ రక్షణ శాఖలోని త్రివిధ దళాలైన ఆర్మీ(Army), నేవీ(Navy), ఎయిర్ ఫోర్స్ లలో(Airforce) చేరి దేశ సేవలో పాలు పంచుకోవాలన్న యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్‌ స్కీమ్‌ ద్వారా అగ్నివీర్ లను నియమించనుంది. రక్షణ శాఖలోని మూడు విభాగాల్లో ఒకటైన ఇండియన్ నేవీలో అగ్నివీర్‌ స్కీం (Indian Navy Agniveer MR) నోటిఫికేషన్ ను విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అగ్నివీర్ MR పోస్ట్‌లకు 2OO ఖాళీలు ఉన్నాయి. ఈ నేవీ అగ్నివీర్ MR పరీక్షను అక్టోబర్ 2022లో నిర్వహించబోతోంది.  అగ్నిపథ్ స్కీమ్ కింద భద్రతా దళాల్లో రిక్రూట్‌మెంట్‌కు వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. తాజాగా ఇండియన్ నేవీ అగ్రివీర్ మెట్రిక్ రిక్రూట్ (Indian Navy Agniveer MR) పోస్టుల కోసం ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇక భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీలో అగ్నివీర్‌ MR స్కీం కింద 200 పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

  Postal Assistant Jobs: పోస్టల్ అసిస్టెంట్(PA/SA) నియామకాలపై కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ లో పలు మార్పులు..


  ఇండియన్ నేవీ అగ్నీవీర్ ఎమ్ఆర్ (Indian Navy Agniveer MR) రిక్రూట్‌మెంట్ కింద సైన్యం మూడు డొమైన్‌లలో తాత్కాలికంగా 200 ఖాళీలను భర్తీ చేస్తుంది. ఎంపిక చేసే మొత్తం 200 పోస్టుల్లో 40 పోస్టులకు మహిళలకు కేటాయించారు. వీటిలో చెఫ్ (MR), స్టీవార్డ్ (MR), హైజీనిస్ట్ (MR) విభాగాలు ఉన్నాయి.  అభ్యర్థుల వయసు రిజిస్టర్ చేసుకున్న తేదీ నాటికి 17.5 -21 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే అగ్నివీర్ 2022 బ్యాచ్‌కు మాత్రమే 23 సంవత్సరాల వరకు గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 10వ తరగతిలో పొందిన మొత్తం శాతం ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌తో ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. అన్ని పరీక్షలు పూర్తి చేసి నవంబర్ 2022 నాటికి మెరిట్ జాబితా అందుబాటులో ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధులను మొదటి బ్యాచ్ గా ప్రకటించి ఈ ఏడాది డిసెంబర్ నెలలో శిక్షణ ప్రారంబిస్తారు.  ఇండియన్ నేవీ అగ్నివీర్ MR ఎంపిక ప్రక్రియ ఆరు దశలను కలిగి ఉంటుంది. అవి 1)షార్ట్ లిస్లింగ్ 2)ఆన్ లైన్ రాత పరీక్ష 3)ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) 4)ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT) 5)డాక్యుమెంట్ వెరిఫికేషన్ 6) మెడికల్ పరీక్షలు ఉంటాయి.

  మొదట షార్ట్‌లిస్టింగ్ (Shortlisting)లో అభ్యర్ధికి సంబంధించిన డాక్యుమెంట్స్, అర్హతలను చూసి షార్ట్ లిస్ట్ చేస్తారు. అన్ని సరిపోయిన వారిని తరువాత జరిగే ఆన్ లైన్ రాత పరీక్ష(Written exam)కు ఎంపిక చేస్తారు. వ్రాత పరీక్ష ప్రకటించిన తేదీన  ఎంపిక చేసిన కేంద్రాలలో కంప్యూటర్‌ బేస్డ్ ఆన్ లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లీషు రెండు భాషల్లోనూ నిర్వహించబడతాయి. ప్రశ్నపత్రం 'సైన్స్ & మ్యాథమెటిక్స్' మరియు 'జనరల్ అవేర్‌నెస్' అనే రెండు విభాగాలను కలిగి ఉంటుంది. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. పదవ తరగతి స్థాయి సిలబస్ నుండే ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు అన్ని విభాగాలతో పాటు మొత్తంలో ఉత్తీర్ణులు కావాలి.

  BIS Recruitment 2022: బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. BISలో పలు పోస్టుల భర్తీ.. జీతం రూ. 50వేలు..


  ఇండియన్ నేవీ అగ్నివీర్ పరీక్ష 2022 ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా వుండాలి? ఎగ్జామ్ టిప్స్ ఏంటి?

  1)పరీక్ష ఆకృతి మరియు స్కోరింగ్ విధానాన్ని అర్థం చేసుకోవడానికి, అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఇండియన్ నేవీ అగ్నిపథ్ సిలబస్ మరియు పరీక్షా విధానాన్ని తెలుసుకోవాలి. గతంలో నిర్వహించబడిన నేవీ ఎగ్జామ్ లలోని ప్రశ్నలు ఎలా వుంటాయో పరిశీలించండి. తద్వారా ప్రిపరేషన్ లో ఉపయోగపడుతుంది.

  2)మెరుగైన ఫలితాల కోసం, అత్యధిక మార్కులు, వెయిటేజీలను పరిశీలించి ఆ టాపిక్స్ ను టైమ్ ఎక్కువ కేటాయించండి. టాపిక్స్ కు అనుగుణంగా వాటికి మరింత శ్రద్ధ పెట్టి ప్రిపేర్ అవ్వండి.

  3)మీ పరీక్ష సన్నద్ధత స్థాయిని పెంచడానికి, మునుపటి సంవత్సరం నుండి ప్రాక్టీస్ పరీక్షలు మరియు ప్రశ్నలను తీసుకోండి.

  .4)ఎక్కువ కాలం విషయాలను గుర్తుంచుకోవడానికి, వారు ఎప్పటికప్పుడు మాక్ టెస్ట్ లకు అటెండ్ అవ్వండి. తద్వారా రాత పరీక్షలో టైమ్ మేనేజ్ మెంట్ చేసుకోవడానికి వీలుంటుంది.

  5) అభ్యర్థులు తప్పనిసరిగా ఇండియన్ నేవీ అగ్నివీర్ సిలబస్‌తో క్షుణ్ణంగా ఉండాలి, తద్వారా వ్రాత పరీక్షలో ఇండియన్ నేవీ అగ్నివీర్ కట్-ఆఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించడానికి ఇది వారికి సహాయపడుతుంది. ఈ టిప్స్ ను పాటించడం ద్వారా రాత పరీక్షను సులభంగా ఎదుర్కొని క్వాలిఫై కావచ్చు.

  ఇలా రాతపరీక్షలో క్వాలిఫై అయ్యి సెలక్ట్ అయిన అభ్యర్ధులకు 3వ రౌండ్ గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) 4వ రౌండ్ గా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT) ఉంటాయి. పురుష అభ్యర్ధులతే (male) అయితే కనీస ఎత్తు 157 సెం.మీ ఉండాలి. 1.6 కి.మీ రన్ ను 6.30 నిమిషాలలో పూర్తి చేయాలి. 20 స్క్వాట్‌లు (ఉతక్ బైఠక్), 10 పుష్-అప్‌లు చేయాలి. అదే ఆడ అభ్యర్ధులు (female) అయితే 152 సెం.మీ ఉండాలి. 1.6 కి.మీ రన్ ను 8 నిమిషాలలో పూర్తి చేయాలి. 5 సిట్-అప్‌లు, 10 బెంట్ మోకాలి సిట్ అప్‌లు చేయాల్సి ఉంటుంది.

  ఇలా రాత పరీక్షలు, ఫిజికల్ పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్ధులకు 5వ రౌండ్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్ ఉంటుంది. ఈ రౌండ్ లో అభ్యర్ధి యొక్క అన్ని సర్ధిఫికేట్స్ ను, ఇతర డాక్యుమెంట్లను వెరిఫై చేస్తారు. అన్ని సరిపోతే తదుపరి 6వ రౌండ్ లో మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ లో అగ్నివీర్ (MR) లకు వర్తించే ప్రస్తుత నిబంధనలలో సూచించిన వైద్య ప్రమాణాల ప్రకారం, సైనిక వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించబడతాయి. వైద్యపరంగా అనర్హులుగా గుర్తించబడిన అభ్యర్థులు, డాక్టర్లు కోరితే మరిన్ని మెడికల్ టెస్ట్ లకు అటెండ్ కావాల్సి ఉంటుంది. అభ్యర్థి మంచి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. ఏదైనా వ్యాధి / వైకల్యం లేకుండా ఉండాలి. ఇండియన్ నేవీ విజువల్ స్టాండర్డ్స్ ప్రకారం కంటి చూపు (ద్ళశ్య ప్రమాణాలు) (eye vision) అద్దాలు లేకుండా బెటర్ ఐ 6/6, వర్స్ ఐ  6/9 ఉండాలి.  అద్దాలతో అయితే బెటర్ ఐ 6/6, వర్స్ ఐ 6/6 ఉండాలి.

  Agniveer Jobs: అగ్నివీర్ కోసం ప్రిపేర్ అవుతున్నారా.. అయితే పరీక్ష విధానం.. ఎంపిక ప్రక్రియ వివరాలిలా..


  ఇలా ఆరు రకాల పరీక్షలు ఒకదాని తర్వాత ఒకటి ఎదుర్కొన్నాక .. వాటిలో వచ్చిన ఫలితాలను డిసెంబర్ మొదటి వారంలో ప్రకటిస్తారు. షార్ట్‌లిస్ట్ లో ఎంపిక చేయబడిన అభ్యర్థులను డిసెంబర్ లో ప్రొవిజన్ సెలక్ట్ లిస్ట్ (PSL) రౌండ్‌కు పిలుస్తారు. ఇక్కడ సెలక్ట్ చేసిన వారితో కూడిన లిస్ట్ ను ఈ ఏడాది డిసెంబర్ చివరి వారం లో ప్రకటిస్తారు. అనంతరం డిసెంబరు చివరి నాటికి మొదటి బ్యాచ్ నమోదును సిద్దం చేసి  (Indian Navy Agniveer MR) శిక్షణ ప్రారంభిస్తారు. అలా శిక్షణ పొందిన వారిని ఇండియన్ నేవీ లోకి తీసుకుంటారు. సో.. అభ్యర్ధులందరికీ ఆల్ ది బెస్ట్.
  Published by:Veera Babu
  First published:

  Tags: Agnipath Scheme, Agniveer, Career and Courses, JOBS, Preparation

  తదుపరి వార్తలు