హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Vodafone Idea App: Vi యాప్ లో అగ్నివీర్ స్టడీ మెటీరియల్.. జాబ్స్ వివరాలు కూడా..

Vodafone Idea App: Vi యాప్ లో అగ్నివీర్ స్టడీ మెటీరియల్.. జాబ్స్ వివరాలు కూడా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా ఈ సంవత్సరం భారత రక్షణ దళాలు నిర్వహించే అగ్నివీర్ పరీక్షల కోసం కోర్సు మెటీరియల్‌లను ప్రవేశపెట్టింది. కంపెనీ తన యాప్‌లో కోర్సును ప్రారంభించేందుకు edtech సంస్థ పరీక్షతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా(Vodafone Idea) ఈ సంవత్సరం భారత రక్షణ దళాలు నిర్వహించే అగ్నివీర్ పరీక్షల(Agniveer Exam) కోసం కోర్సు మెటీరియల్‌లను(Material) ప్రవేశపెట్టింది. కంపెనీ తన యాప్‌లో కోర్సును ప్రారంభించేందుకు edtech సంస్థ పరీక్షతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో తన మొబైల్ యాప్‌లో కొన్ని నెలల క్రితం కొత్తగా జాబ్ పోర్టల్‌ను ప్రకటించింది. దీంతో పాటు.. ఇప్పుడు ఈ యాప్‌లోని జాబ్ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారుల కోసం అగ్నివీర్ కోర్సు మెటీరియల్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

EAMCET Chemistry Preparation Tips: ఈ టిప్స్ పాంటిస్తే.. ఎంసెట్ కెమిస్ట్రీలో మంచి స్కోర్ సాధించొచ్చు..


అగ్నివీర్ టెస్ట్ సిరీస్‌ను నిర్వహించడానికి డెహ్రాడూన్‌కు చెందిన క్యాడెట్స్ డిఫెన్స్ అకాడమీ నిపుణులతో కలిసి పనిచేస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీరుల పరీక్షను జూలై 24, 2022న నిర్వహించనున్నది. అంతేకాకుండా 2800 ఇండియన్ నేవీ అగ్నివీర్ (SSR) ఖాళీలను భర్తీ చేయడం కోసం ఆన్‌లైన్ పద్దతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో చేరాలని ఆసక్తి ఉన్న వారు www.joinindiannavy.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా జూలై 15 నుండి జూలై 22 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలకు సన్నధం అవ్వడానికి కావాలసిన మెటీరియల్‌ ఇప్పుడు Vi యాప్‌లో అందుబాటులో ఉంది. Vi జాబ్స్ మరియు ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్‌లో ఒక నెల పాటు అనేక ఇతర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలతో పాటు అగ్నివీర్ కోసం టెస్ట్ ప్రిపరేషన్ మెటీరియల్‌కు ఉచితంగా అందిస్తున్నట్లు Vi చెప్పింది.

ట్రయల్ వ్యవధి అంటే.. ఒక నెల రోజుల వరకు పూర్తిగా ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆ నెల తర్వాత వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌లో సంవత్సరానికి రూ. 249 సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలి. దీంతో వినియోగదారులు అపరిమిత మాక్ టెస్ట్‌లను పొందుతారు. ప్లాట్‌ఫారమ్‌లో 150+ కంటే ఎక్కువ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌లు ఉన్నాయి. Vi జాబ్స్ & ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయడానికి మీ రిజిస్టర్డ్ నంబర్ ద్వారా Vi మొబైల్ యాప్‌లో లాగిన్ చేయవచ్చు.


“Vi యాప్‌లోని అగ్నివీర్ టెస్ట్ సిరీస్ అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ X గ్రూప్, అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ Y గ్రూప్, అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ X & Y గ్రూప్, అగ్నివీర్ నేవీ MR మరియు అగ్నివీర్ నేవీ SSR కోసం ఒక్కొక్కటి 15 టెస్ట్‌లతో కూడిన 5 టెస్ట్ సిరీస్‌లను అందిస్తుంది. ఈ నెలాఖరులోగా ఆర్మీ టెస్ట్ సిరీస్ లను యాప్ లో అప్ లోడ్ చేయనున్నారు. అగ్నివీర్‌తో సహా వివిధ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులకు మెటీరియల్ ను పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది.

అగ్నిపథ్ పథకం కింద.. 17 మరియు 21 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు నాలుగు సంవత్సరాల పదవీకాలానికి సాయుధ దళాలలో చేరనున్నారు. ప్రభుత్వం జూన్ 16న.. ఈ పథకం కింద రిక్రూట్‌మెంట్ గరిష్ట వయో పరిమితిని 2022 సంవత్సరానికి 21 నుండి 23 సంవత్సరాలకు పెంచిన సంగతి తెలిసిందే. అగ్రివీరుల్లో 25 శాతం మందిని వారి పనితీరు ఆధారంగా పర్మినెంట్ ఉద్యోగాలు పొందనున్నారు.

First published:

Tags: Agnipath Scheme, Career and Courses, JOBS, Vodafone Idea

ఉత్తమ కథలు