AGNIPATH SCHEME WHAT WILL AGNIVEERS DO AFTER 4 YRS OF SERVICE HERE IS THE ANSWER NS GH
Agnipath: నాలుగేళ్ల సర్వీస్ తర్వాత అగ్నివీరులు ఏం చేయవచ్చు..? వారికి ఉండే కెరీర్ ఆప్షన్స్ ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
అగ్నిపథ్ పథకంపై విమర్శలు రావడంతో కేంద్రం స్పందించింది. అనేక మంది అగ్నివీరులు సాయుధ బలగాలలో శాశ్వత కేడర్‌కు ఎంపిక కానున్నట్లు కేంద్రం ట్విట్టర్లో తెలిపింది. దీంతోపాటు నాలుగేళ్ల తర్వాత బలగాల నుంచి వైదొలిగే వారి కోసం కూడా కొన్ని కెరీర్ ఆప్షన్లను రూపొందించింది. ఆ వివరాలు..
సాయుధ దళాల్లో తాత్కాలిక పద్దతిలో రిక్రూట్మెంట్ కోసం అగ్నిపథ్ (Agnipath Scheme) పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువకులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్నిపథ్‌కు (Agnipath Scheme) ఎంపికైన వారిని అగ్నివీరులుగా పిలుస్తారు. త్రివిధ దళాల్లో వీరు నాలుగు సంవత్సరాల పాటు సేవలందించనున్నారు. సర్వీస్ పూర్తయిన తర్వాత 25% అగ్నివీరులను రెగ్యులర్ సర్వీస్ కోసం రిటైన్ చేసుకోనున్నారు. మిగతా 75% అగ్నివీరులు సర్వీస్ నుంచి రిలీవ్ కానున్నారు. అయితే ముందు నుంచి సాయుధ బలగాల్లో చేరాలనుకుంటున్న ఔత్సాహిక అభ్యర్థులు అగ్నిపథ్ పథకంపై విమర్శలు గుప్పిస్తున్నారు. నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత అగ్నివీర్లు (Agniveers) ఏం చేయాలనే దానిపై అనేక మంది ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.
-నాలుగు సంవత్సరాల తర్వాత సాయుధ దళాల నుండి వైదొలిగే అగ్నివీరులకు ₹12 లక్షల ఆర్థిక ప్యాకేజీ లభిస్తుంది. ఈ నిధులతో ఏదైనా వ్యాపారం ప్రారంభించుకోవచ్చు.
-ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకునే అగ్నివీరులకు బ్యాంకు రుణ పథకాల్లో ప్రాధాన్యత లభిస్తుంది.
-చదువుకోవాలనుకునే అగ్నివీరులకు తమ తదుపరి చదువుల కోసం 12వ తరగతికి సమానమైన సర్టిఫికేట్, బ్రిడ్జింగ్ కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
-అగ్నిపథ్ పథకం కింద తమ సర్వీస్ పూర్తయిన తర్వాత పని చేయాలనుకునే అగ్నివీర్లకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), అస్సాం రైఫిల్స్‌తోపాటు అనేక రాష్ట్రాల్లో పోలీసు, అనుబంధ దళాలలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
-ఇంజినీరింగ్, మెకానిక్స్, లా అండ్ ఆర్డర్ తదతర విభాగాల్లో అగ్నివీర్లకు స్పష్టమైన నైపుణ్యాలు, వర్క్ ఎక్స్పీరియన్స్ అందిస్తామని కేంద్రం తెలిపింది.
-స్కిల్స్‌తో పాటు క్రమశిక్షణ ఉన్న అగ్నివీర్లను నియమించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రధాన కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి.
ఉన్నత విద్య అవకాశాలు
సాయుధ దళాల్లో సేవలందిస్తూనే అగ్నివీరులు తమ చదువును కొనసాగించవచ్చు. ఇందుకోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) అవసరమైన కోర్సులను అభివృద్ధి చేయనుంది. తద్వారా 12వ తరగతి పాస్ సర్టిఫికేట్ ఇవ్వనుంది. ఈ మేరకు రక్షణ శాఖ అధికారులతో సంప్రదించి NIOS ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయనుందని కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది. ఎన్ఐఓఎస్ అందించే సర్టిఫికేట్ ద్వారా దేశంలో ఎక్కడైనా ఉద్యోగవకాశాలను పొందవచ్చు. లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది.
దీంతోపాటు రక్షణ శాఖలో సేవలందించే అగ్నివీరుల కోసం ప్రత్యేక మూడు సంవత్సరాల నైపుణ్య ఆధారిత బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తామని కేంద్ర విద్యా శాఖ గురువారం ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్‌ను ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) డిజైన్ చేయనుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.