AGNIPATH SCHEME TRAINING OF FIRST AGNIVEERS TO BEGIN IN DECEMBER HERE DETAILS NS
Agnipath Notification: అగ్నిపథ్ పై తగ్గని మోదీ సర్కార్.. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్.. ట్రైనింగ్ ఎప్పటినుంచంటే?
ప్రతీకాత్మక చిత్రం
ఆర్మీ, వాయుసేన అధిపతులు తాజాగా కీలక ప్రకటన చేశారు. అగ్నిపథ్ పథకం (Agnipath Scheme) కింద త్వరలోనే నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్రం తాజాగా ప్రకటించిన 'అగ్నిపథ్' పథకంపై (Agnipath Scheme) దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ఈ రోజు సికింద్రాబాద్ స్టేషన్లో (Secunderabad Railway Station) నినసనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిపిందే. ఇదిలా ఉంటే.. ఆర్మీ, వాయుసేన అధిపతులు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద త్వరలోనే నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అగ్నిపథ్ పథకంలో భాగంగా ఈ ఏడాది చేరే అభ్యర్థులకు వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఆర్మీ చీఫ్ (Army Chief) మనోజ్ పాండే మాట్లాడుతూ.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సైన్యం చేరడానికి అవకాశం రాని అభ్యర్థులకు ఉపశమనం కలిగిందన్నారు. తెలిపారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని యువతకు తమ దేశభక్తిని చాటుకునే అవకాశం దొరుకుతుందన్నారు. రిక్రూట్మెంట్ ర్యాలీల్లో చేరేందుకు సిద్ధమవుతున్న యువకులకు ఇది మంచి అవకాశం అన్నారు ఆయన. 2022 డిసెంబర్లో మొదటి బ్యాచ్ అగ్నివీరులకు శిక్షణ ప్రారంభించనున్నట్లు చెప్పారు.
2023 జూన్ లేదా జులైలో వీరికి బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుందని తెలిపారు. ఇందుకు సంబంధించి మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని చెప్పారు. రిజిస్ట్రేషన్ తదితర అంశాలకు సంబంధించన షెడ్యూల్ ను త్వరలో ప్రకటిస్తామన్నారు. Agnipath Scheme: అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏంటీ? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎందుకీ విధ్వంసం?
#WATCH | "...The first agniveer will join our regimental centres by December (2022) and will be available for deployment in our operational and non-operational by the middle of next year," says Army Chief General Manoj Pande.#AgnipathSchemepic.twitter.com/VYOjmSQjQu
ఈ నెలలోనే వాయుసేన నియామకాలు ప్రారంభిస్తున్నట్లు వాయుసేన అధిపతి వీఆర్ చౌదరి సైతం ప్రకటించారు. వాయుసేనలో అగ్నిపథ్ నియమకాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఎయిర్ఫోర్స్ చీఫ్ ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.