కేంద్రం యువత కోసం మరో పథకం ప్రకటిస్తోంది. ఈ స్కీమ్ పేరు అగ్నిపథ్ స్కీమ్‌ను (Agnipath Scheme). సాయుధ దళాల్లో యువత భాగస్వామ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. స్వల్పకాల వ్యవధిలో యువతను సైన్యంలోకి తీసుకోవడానికి అగ్నిపథ్ అనే కొత్త రిక్రూట్ మెంట్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు.
NSDC: కెరీర్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నారా..? అయితే, ఈ ఫ్రీ వర్క్ షాప్ మీ కోసమే..
జీతం ఎంత వరకు ఉంటుంది ?
అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీమ్ కింద ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరంలో రూ.4.76 లక్షల వార్షిక ప్యాకేజిని అందిస్తారు. అది నాలుగో సంవత్సరం నాటికి 6.92 లక్షలకు పెరగనుంది. ఇది కాకుండా రిస్క్ అలవెన్సులు, ఇతర అలవెన్సులు అందజేస్తారు. నాలుగేళ్ల సర్వీసు ముగిసిన తర్వాత యవతకు రూ.11.7 లక్షలను సేవా నిధి రూపంలో అందజేస్తారు. దీనిపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు.
సంవత్సరం | నెల వేతనం | చేతికొచ్చే వేతనం | అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు సహకారం | GoI ద్వారా కార్పస్ ఫండ్‌కు సహకారం |
1st Year | 30000 | 21000 | 9000 | 9000 |
2nd Year | 33000 | 23100 | 9900 | 9900 |
3rd Year | 36500 | 25580 | 10950 | 10950 |
4th Year | 40000 | 28000 | 12000 | 12000 |
ముఖ్యమైన అంశాలు..
- ముఖ్యంగా దేశానికి సేవ చేయాలనే స్ఫూర్తి ఉన్న యువతకు అగ్నిపథ్ స్కీమ్
- స్వల్ప కాలం సేవలందించి తరువాత ఇతర ఉద్యోగాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
- అలాగే త్రివధ దళాల్లో యువత భాగస్వామ్యం పెరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల సైన్యా నికి కోట్లాది రూపాయిలు ఖర్చు ఆదాకానుంది.
- నాలుగేళ్ల తరువాత కూడా కొనసాగే కొద్ది మంది అగ్నివీర్లకు మాత్రమే పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.
- మరో వైపు జీతంలో కూడా పొదుపు కానుంది.
- ఈ పథకం కింద రిక్రూట్ అయిన చాలా మంది సైనికులు నాలుగేళ్ల తర్వాత విధుల నుంచి బయటకు వెళ్లే అవకాశం వస్తుంది.
- కొంత మందిని మాత్రం కొనసాగిస్తారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల యువతకు ఇందులో చేరేందుకు అవకాశం ఉంటుంది.
- ఎంపికైన వారికి 10 వారాల నుండి 6 నెలల వరకు శిక్షణ ఉంటుంది.
- దీని కోసం విద్యార్హత పది లేదా ఇంటర్ మీడియట్ గా నిర్ణయించారు.
- 90 రోజులలో అగ్నివీర్ల మొదటి రిక్రూట్మెంట్ ఉండనుంది. పదవీ విరమణ తర్వాత పెన్షన్ ఉండదు.
- పెన్షన్ కు సంబంధించిన ప్యాకేజ్ మొత్తం ఒకేసారి అందిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.