Home /News /jobs /

AGNIPATH NOTIFICATION RELEASED HERE FULL DETAILS ABOUT AGNIVEERS SALARY NS

Agnipath Agniveers Salaries: అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల.. అగ్నివీరులకు వేతనం ఎంతో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అగ్నిపథ్ కు సంబంధించి తాజాగా నోటిఫికేషన్(Agnipath Notification) విడుదలైంది. ఇండియన్ అర్మీలో అగ్నివీర్ ల ఉద్యోగాల భర్తీకి అధికారులు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. నోటిఫికేషన్లో తెలిపిన వివరాల ప్రకారం అగ్నివీరులకు వేతనం ఈ విధంగా ఉంటుంది.

ఇంకా చదవండి ...
    కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ఇటీవల అగ్నిపథ్ పథకాన్ని (Agnipath Scheme) తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తమైనా ఎక్కడా వెనక్కి తగ్గలేదు కేంద్రం. అగ్నిపథ్ పథకం కింద తాజాగా ఆర్మీలో అగ్నివీరుల (Agniveers) నియామకాలకు నోటిఫికేషన్ (Agnipath Notification) ను విడుదల చేశారు అధికారులు. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు ప్రక్రియ జులై నుంచి ప్రారంభం అవుతుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్పటి నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అగ్నిపథ్ పథకంపై తీవ్రంగా నిరసలను వ్యక్తమవుతుండడంతో అసలు అగ్నిపథ్ పథకం ద్వారా నియమితులయ్యే అగ్నివీరులకు వేతనం ఎలా ఉంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.

    అయితే.. నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం..
    అగ్ని వీరులుగా ఎంపికైన వారికి..
    1. మొదటి ఏడాది ప్రతీ నెల రూ.30 వేల వేతనం చెల్లించనున్నారు.
    2.రెండవ ఏడాది నెలకు రూ.33 వేల వేతనం ఉంటుంది.
    3.మూడవ ఏడాది నెలకు రూ.36,500 వేతనం చెల్లించనున్నారు.
    4.నాలుగవ ఏడాది నెలకు రూ.40 వేలు చెల్లిస్తారు.
    Agnipath Notification Qualifications: అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల.. విద్యార్హతల వివరాలివే

    అయితే ఈ వేతనంలో నుంచి 30 శాతం కార్పస్ ఫండ్ కింద జమ చేస్తారు. అంటే మొదటి ఏడాది పాటు నెలకు రూ.21 వేలు మాత్రమే వేతనంగా అగ్నివీరులకు అందుతుంది. మిగతా 9 వేలు కార్పస్ ఫండ్ కింద జమ చేస్తారు. భారత ప్రభుత్వం కూడా అంతే మొత్తం జమ చేస్తుంది. 4 ఏళ్ల తర్వాత మొత్తం 10.4 లక్షలకు వడ్డీతో కలిపి అగ్నివీరులకు చెల్లిస్తారు.


    అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్ అంటే ఏమిటి?
    అగ్నిపథ్ అనేది జూన్ 14, 2022న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రిక్రూట్‌మెంట్ పథకం. ఈ పథకం కింద ఎంపికైన అభ్యర్థులందరినీ "అగ్నివీర్స్" అని పిలుస్తారు. ఈ పథకం కింద, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మరియు నేవీ అన్ని కేడర్‌లలో నాలుగు సంవత్సరాల పదవీకాలానికి మాత్రమే అగ్నివీర్లను నియమించుకుంటారు. ఈ పథకం కింద, 2022లో దాదాపు 46,000 మంది యువత రిక్రూట్ చేయబడతారు. ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్ల సంఖ్య 5,000 పెరుగుతుంది. సైనికులకు నెలకు దాదాపు రూ.30,000-40,000 జీతం లభిస్తుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Agnipath Protest, Agnipath Scheme, Central Government Jobs, Indian Army, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు