Home /News /jobs /

AGNIPATH AMID PROTESTS CENTRE RAISES ENTRY AGE LIMIT TO 23 YEARS AS ONE TIME WAIVER HERE IS MORE DETAILS SK

Agnipath: గుడ్‌న్యూస్.. అగ్నిపథ్ ఆర్మీ పోస్ట్‌లపై కేంద్రం కీలక నిర్ణయం..వయో పరిమితి పెంపు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Agnipath Scheme: అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరాలనుకుంటున్న యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని రెండేళ్లకు పెంచింది. ఐతే ఈ ఏడాది నియామకాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

    కేంద్రం ఇటీవల ప్రకటించిన 'అగ్నిపథ్' ఆర్మీ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ (Agnipath Army Recruitment Scheme) ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిని కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అగ్నిపథ్ కొత్త సర్వీస్‌ పథకంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గరిష్ట వయో పరిమితిని రెండేళ్ల పాటు పెంచారు. అంటే 23 ఏళ్ల వయసున్న వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే 2022 నియామకాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. త్రివిధ దళాల్లో అగ్నిపథ్ పథకం కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 17.5 నుంచి 21 ఏళ్లుగా కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ఐతే కరోనా (Coronavirus) కారణంగా గత రెండేళ్ల నుంచి సైనిక నియామకాలు చేపట్టలేదు. ఈనేపథ్యంలో ఈ ఏడాది కొంత సడలింపు ఇచ్చింది. 2022 నియమకాలకు సంబంధించి అర్హతను గరిష్టంగా 23 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది.


    అగ్నిపథ్ పథకంపై ఎందుకంత గందరగోళం.. ఈ స్కీమ్‌పై ఉన్న అపోహలు, వాస్తవాలు ప్రత్యేకంగా మీ కోసం


    ఆర్మీ (Indian Navy), నేవీ (Indian Navy), ఎయిర్‌ఫోర్స్‌ (Indian Air force)లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల అగ్నివీర్ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఉద్యోగాలు పొందిన వారికి నాలుగేళ్ల సర్వీస్ మాత్రమే ఉంటుంది. నాలుగేళ్ల సర్వీస్‌ తర్వాత ఉద్యోగాల నుంచి రిలీవ్‌ చేస్తారు. 25 శాతం మందిని మాత్రం సర్వీస్‌లో కొనసాగిస్తారు. ఈ పథకం కింద తొలిబ్యాచ్లో 45వేల మందిని నియమించనున్నారు. టూర్ ఆఫ్ డ్యూటీ పేరిట ప్రత్యేక ర్యాలీలు నిర్వహించి నియామకాలు చేపట్టనున్నారు. అగ్నివీర్‌ (Agniveer)కు ఎంపికైనవారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పోస్టింగ్ ఇస్తారు. నాలుగేళ్ల కాల వ్యవధిలో ఆరు నెలల శిక్షణ కాలం కూడా కలిపే ఉంటుంది. అంటే మూడున్నరేళ్లు పనిచేయాలి.



    అగ్నివీర్‌ విభాగానికి కొత్త లోగో, కొత్త యూనిఫాం ఉంటుంది. నెలకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు జీతం ఉంటుంది. అలవెన్సులు కూడా ఉంటాయి. మెడికల్, ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే రూ.48 లక్షల వరకు జీవిత బీమా కల్పిస్తారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీలో నాలుగేళ్ల సర్వీస్‌ పూర్తయ్యాక.. అగ్నివీర్‌ సర్టిఫికేట్‌ అందజేస్తారు. అగ్నివీర్‌ సర్వీస్‌ తర్వాత ఇతర ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జిట్ సమయంలో రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు సేవా నిధి ప్యాకేజీ లభిస్తుంది. వారికి ఎలాంటి పెన్షన్ బెనిఫిట్స్ ఉండవు. అయితే ఆ తర్వాత మరో కెరీర్‌లో స్థిరపడేందుకు బ్యాంకుల నుంచి రుణాలు లభిస్తాయి. ఈ స్కీమ్ ద్వారా డిఫెన్స్ వార్షిక ఖర్చులు బాగా తగ్గిపోతాయి. వార్షిక డిఫెన్స్ బడ్జెట్ రూ.5.2 లక్షల కోట్లకు తగ్గుతుంది.

    అగ్నిపథ్ పథకంపై అపోహలు.. అన్నింటికీ క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. వివరాలివే..


    ఐతే అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పాత పద్దతిలోనే సైనిక నియామకాలు చేపట్టాలని ఢిల్లీ,యూపీ, బీహార్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో యువత ఆందోళన చేస్తున్నారు. బీహార్‌లో పలు చోట్ల రైళ్లకు నిప్పుపెట్టారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Agnipath Scheme, Indian Army

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు