హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Agnipath 2022: జనవరిలో అగ్నిపథ్ కంబైన్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌.. పక్కా జాబ్ కోసం ప్రిపరేషన్ టిప్స్..

Agnipath 2022: జనవరిలో అగ్నిపథ్ కంబైన్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌.. పక్కా జాబ్ కోసం ప్రిపరేషన్ టిప్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అగ్నిపథ్ రెండో బ్యాచ్ కోసం సీఈఈ పరీక్ష నిర్వహించడానికి ఇండియన్ ఆర్మీ సిద్ధమవుతోంది. ఈ పరీక్షను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే అవకాశం ఉంది. 

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

భారత ప్రభుత్వం రక్షణ రంగంలో నియామకాల కోసం అగ్నిపథ్(Agnipath) పేరుతో విప్లవాత్మకమైన మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే. తాత్కాలిక పద్దతిలో నాలుగు సంవత్సరాల సర్వీస్ కోసం ఈ పథకం ద్వారా సాయుధ దళాల్లో పనిచేయడానికి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అగ్నిపథ్ ఇండియన్ ఆర్మీ(Indian Army) మొదటి బ్యాచ్‌కు సంబంధించి ఆగస్టులో జరిగిన ర్యాలీ రౌండ్‌లో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు అక్టోబర్ 16న కంబైన్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌(సీఈఈ) నిర్వహించారు. తాజాగా రెండో బ్యాచ్ కోసం సీఈఈ పరీక్ష(CEE Exam) నిర్వహించడానికి ఇండియన్ ఆర్మీ సిద్ధమవుతోంది. ఈ పరీక్షను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్‌కు ఇంకా నెలన్నర సమయం మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు ప్రిపరేషన్‌లో పూర్తిగా నిమగ్నమవ్వాలి. సీఈఈ పరీక్షలో బెస్ట్ స్కోర్ చేయడానికి ప్రిపరేషన్ టిప్స్ పరిశీలిద్దాం.

* తెలుసుకోవాల్సిన విషయాలు

అభ్యర్థులు ప్రిపరేషన్‌ను మరింత వేగవంతం చేయడానికి తప్పనిసరిగా సిలబస్, పరీక్ష సరళి, కటాఫ్స్, మార్కింగ్ స్కీమ్ వంటి ముఖ్యమైన విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి పోస్ట్‌కు ప్రత్యేకమైన పరీక్ష విధానం ఉంటుంది. దీంతో ఏ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయో అభ్యర్థులు తెలుసుకోవాలి. అంతేకాకుండా సీసీఈలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుందన్న విషయాన్ని అభ్యర్థులు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

* మాక్ టెస్ట్స్, శాంపిల్ పేపర్స్ ప్రాక్టీస్..

ప్రిపరేషన్‌ను బలోపేతం చేయడానికి మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలు, మాక్ టెస్ట్స్, శాంపిల్ పేపర్స్ వంటి వాటిని సాల్వ్ చేయడానికి తగినంత సమయం కేటాయించండి. మీ ప్రిపరేషన్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, వీక్‌గా ఉన్న ఏరియాలో మరింత దృష్టిసారించి మెరుగవ్వడానికి ఇవి సహాయపడతాయి. అయితే, పూర్తిగా కొత్త అంశాలను నేర్చుకోవడంలో పొరపాటు చేయవద్దు. మీ బలాన్ని పెంచుకోవడంపై కూడా దృష్టి పెట్టండి.

* మంచి ఆహారం, నిద్ర

అగ్నిపథ్ కంబైన్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ కోసం చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతుంటారు. అయితే ప్రిపరేషన్‌తో పాటు ఆరోగ్యంపై కూడా అభ్యర్థులు దృష్టి పెట్టాలి. అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. దీంతో మైండ్ రిలీఫ్ అవుతుంది. పరీక్షకు ఒకటి లేదా రెండు రోజుల ముందు త్వరగా పడుకోని, త్వరగా నిద్రలేవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీపై నమ్మకంగా ఉండండి.

Jobs In IOCL: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. ఐదు రీజియన్ల వారీగా భర్తీ..

* భర్తీ కానున్న పోస్టులు..

సీఈఈ పరీక్ష ద్వారా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ టెక్నికల్ (ఏవియేషన్/ అమ్యూనిటేషన్ ఎగ్జామినర్), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ 10వ తరగతి, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ 8వ తరగతి వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

10 Lack Jobs: పది లక్షల ఉద్యోగాలకు.. కార్యాచరణ మొదలు పెట్టిన కేంద్రం.. వచ్చే సంవత్సరం ఉద్యోగాల జాతరే..

ఇవి తప్పనిసరి..

చాలా మంది అభ్యర్థులు పరీక్షకు ముందు రోజు అడ్మిట్ కార్డ్ ప్రింట్ తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో సైట్ పనిచేయకపోవచ్చు. దీంతో వీలైనంత ముందుగా అడ్మిట్ కార్డ్ ను సిద్ధంగా ఉంచుకోవాలి. పరీక్ష కేంద్రానికి చేరుకున్నప్పుడు అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌తో పాటు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పాన్ కార్డ్ , ఆధార్ కార్డ్ , ఓటర్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర ఫోటో గుర్తింపును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.

First published:

Tags: Agnipath Scheme, JOBS

ఉత్తమ కథలు