AGNEEPATH SCHEME GETS OVER 56K APPLICATIONS RECEIVED FOR IAF AGNIVEER RECRUITMENT UMG GH
Agneepath: 'అగ్నిపథ్'కు ఊహించని రెస్పాన్స్..! ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే..?
అగ్నివీర్స్‌కు 56 వేల దరఖాస్తులు.
ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం అగ్నిపథ్ స్కీమ్ రిక్రూట్మెంట్ 2022 జరుగుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force)కి అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2022 కింద 56 వేల మందికి పైగా దరఖాస్తులు చేసినట్లు అధికారులు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే అగ్నిపథ్ పథకానికి ఆదరణ లభిస్తోంది.
భారతీయ యువతకు సైన్యంలో (Indian Army) అవకాశాలు కల్పించేందుకు కొత్తగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ (Agneepath) పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్మీలో (Army) చేరాలనుకున్న కొందరు అభ్యర్థులు దీనిపై తీవ్ర ఆందోళనలు చేపట్టారు. ఇప్పటికీ కొన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అయితే భారతీయ యువత నుంచి అగ్నిపథ్ రిక్రూట్మెంట్కు విశేష స్పందన కనిపిస్తోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం అగ్నిపథ్ స్కీమ్ రిక్రూట్మెంట్ 2022 జరుగుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force)కి అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2022 కింద 56 వేల మందికి పైగా దరఖాస్తులు చేసినట్లు అధికారులు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే అగ్నిపథ్ పథకానికి ఆదరణ లభిస్తోందని అధికారులు చెబుతున్నారు.
ఇదివరకు కేంద్రం ఓ ప్రకటన ద్వారా ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేసింది. అగ్నివీర్లకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని, నాలుగేళ్ల తర్వాత వారు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటే ఆర్థిక సాయం లభిస్తుందని పేర్కొంది. బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని, చదువు కొనసాగించాలనుకుంటే 12వ తరగతికి సమానమైన ధ్రువీకరణ పత్రం ఇస్తామని చెప్పింది. ఉద్యోగాలు చేయాలనుకునే వారికి కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో, రాష్ట్ర పోలీసు నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. సైన్యంలో నియామకాలు తగ్గుతాయని వస్తున్న ఆరోపణలు సరికాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటి వరకు 56,960 దరఖాస్తులు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2022 ప్రక్రియ 2022 జూన్ 24న ప్రారంభమైంది. రిక్రూట్మెంట్కు సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. తాజాగా భవిష్యత్తు అగ్నివీరుల నుంచి ఇప్పటి వరకు మొత్తం 56,960 దరఖాస్తులు అందాయని స్పష్టం చేసింది. అగ్నిపథ్ పథకం కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు దరఖాస్తు చేసుకునేందుకు 2022 జూలై 5ను గడువుగా పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తులను Agniveervayu.cdac.in వెబ్సైట్లో సమర్పించవచ్చు. సంస్థ ఆన్లైన్ దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జారీ చేసిన క్యాలెండర్ ప్రకారం.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం అగ్నివీర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్‌ను జూలైలో నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత తేదీని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటిస్తుంది.
అగ్నిపథ్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ కోసం, భారతదేశంలోని అవివాహిత పురుషులు, నేపాల్ నుంచి రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. 17.5 ఏళ్ల నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులు. 2022 అగ్నివీర్ బ్యాచ్ కోసం, గరిష్ట వయోపరిమితిని 23 సంవత్సరాలకు పెంచారు. ఇది ప్రస్తుత బ్యాచ్‌కి మాత్రమే వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.