Home /News /jobs /

AGNEEPATH REGISTRATIONS TO BEGIN FROM THIS MONTH HERE DETAILS FOR ASPIRANTS NS

Agnipath Registration: అగ్నివీరులు కావాలనుకుంటున్న వారికి అలర్ట్.. రిజిస్ట్రేషన్లు ఎప్పటినుంచంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అగ్నిపథ్ పథకం విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ స్పష్టం చేసింది. జూన్ 24 నుంచే ఇందుకు సంబంధించిన తొలి బ్యాచ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుందని రక్షణ శాఖ వెల్లడించింది.

    కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ (Central Government) ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం(Agnipath Scheme) పై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా సైతం మారిన విషయం తెలిసిందే. తాజాగా సికింద్రాబాద్ స్టేషన్లో (Secunderabad Station) ఆందోళకారులపై జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందడం దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆందోళనకారులు పలు రైళ్ల బోగీలకు నిప్పు పెట్టడంతో రైల్వే శాఖకు భారీ నష్టం సైతం వాటిల్లింది. ఈ ఆందోళనల నేపథ్యంలో రక్షణ శాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది. అగ్నిపథ్ పథకం విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ స్పష్టం చేసింది. జూన్ 24 నుంచే ఇందుకు సంబంధించిన తొలి బ్యాచ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుందని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ అంశంపై ఎయిర్ మార్షల్ సూరజ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. అగ్నివీర్స్ కు సంబంధించిన మొదటి బ్యాచ్ ఎన్రోల్మెంట్ జూన్ 24న మొదలవుతుందన్నారు. ఇందుకు సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ నెల తర్వాత ఉంటుందన్నారు.

    ఎయిర్ఫోర్స్ అగ్నివీర్స్ కు సంబంధించిన ముఖ్య తేదీలు:
    రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభం: జూన్ 24..
    ఫేజ్-1 పరీక్షలు ప్రారంభం: జులై 24 నుంచి..
    ఫస్ట్ బ్యాచ్ అగ్నివీరులకు శిక్షణ - డిసెంబర్ 30 నుంచి..
    Agnipath: నాలుగేళ్ల సర్వీస్ తర్వాత అగ్నివీరులు ఏం చేయవచ్చు..? వారికి ఉండే కెరీర్ ఆప్షన్స్ ఇవే..





    అగ్నిపథ్ పథకంపై (Agnipath Scheme) దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలను వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆందోళనకారులు శాంతించేలా కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద సైన్యంలో చేరి పదవీ విరమణ చేసే అగ్నివీరులకు (Agniveers) రక్షణ శాఖలో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పటికే వెల్లడించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులతో పాటు 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ విభాగాల్లో ఈ రిజర్వేషన్ వస్తుందని రాజన్ నాథ్ సింగ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Agnipath Protest, Agnipath Scheme, Indian Army, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు