హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IGNOU: ఫేక్ స్కూల్ బోర్డులను గుర్తించిన ఇగ్నో.. ఈ జాబితాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయంటే..

IGNOU: ఫేక్ స్కూల్ బోర్డులను గుర్తించిన ఇగ్నో.. ఈ జాబితాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ 116 నకిలీ స్కూల్ బోర్డుల జాబితాను విడుదల చేసింది. ఈ విద్యాసంస్థలో చదివిన విద్యార్థులకు వర్సిటీ అడ్మిషన్ ఇవ్వదని పేర్కొంది.

విద్యార్థుల భవిష్యత్తుతో నకిలీ విద్యాసంస్థలు ఆడుకుంటున్నాయి. కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించి, పై స్థాయికి వెళ్లాలనే లక్ష్యంతో విద్యార్థులు(Students) మంచి కాలేజీలు(Colleges), పాఠశాలలను ఎంచుకుంటారు. అయితే విద్యార్థుల ఆశలను కొన్ని విద్యాసంస్థలు ఆదిలోనే తుంచేస్తున్నాయి. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలు(Schools) డబ్బులకు సర్టిఫికేట్లు(Certificates) ఇస్తూ.. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. ప్రభుత్వం(Government) చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి ఫేక్ స్కూల్స్(Fake Schools) పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఫేక్ స్కూల్స్‌కు సంబంధించి ఇగ్నో మరో జాబితాను విడుదల చేసింది.

ఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ 116 నకిలీ స్కూల్ బోర్డుల జాబితాను విడుదల చేసింది. ఈ విద్యాసంస్థలో చదివిన విద్యార్థులకు వర్సిటీ అడ్మిషన్ ఇవ్వదని పేర్కొంది. ఈ నకిలీ పాఠశాల బోర్డులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయని తెలిపింది. గుర్తింపు పొందిన పాఠశాలలుగా ఇవి చెలామణి అవుతున్నాయని తేల్చింది.

TS 10th Physics: ప‌దోత‌ర‌గ‌తి ఫిజిక్స్‌లో మంచి స్కోర్ చేయాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

నకిలీ స్కూల్ బోర్డుల సమస్యను ఇగ్నో కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరింది. వివిధ బోర్డుల ప్రమాణికతను గుర్తించడానికి SoP (స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌)ని అభివృద్ధి చేయడానికి కేంద్రం కృషి చేస్తోంది. ఇది ఇన్‌స్టిట్యూట్‌లు నకిలీ బోర్డులను, నిజమైన బోర్డులను గుర్తించడంలో సహాయపడుతుంది. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్(AIU)కి ఈ బోర్డుల ప్రామాణికతను నిర్ధారించే బాధ్యతను అప్పగించింది. ఇప్పుడు విద్యాసంస్థలు ఏఐయూ జాబితాలో ఉంటేనే అధికారిక విద్యాసంస్థల కిందకి వస్తాయి. ఏఐయూ జాబితాలో లేనివి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వనివని ప్రభుత్వం తెలిపింది. ఏఐయూ జాబితాను వచ్చే నెలలో విడుదల చేసే అవకాశం ఉంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు ఎడ్యుకేషన్ బోర్డులు ఏర్పడతాయి. విద్యాశాఖ ప్రకారం రెండు జాతీయ స్థాయి వర్సిటీలు మాత్రమే ఉన్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్(ఎన్ఐఓఎస్) వంటి రెండు జాతీయ స్థాయి వర్సిటీలు మాత్రమే విద్యాశాఖ పరిధిలో ఉన్నాయి. ఇగ్నో 116 నకిలీ బోర్డులను జాబితా విడుదల చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. గుర్తింపు పొందిన బోర్డుల పేర్లను విడుదల చేయడానికి అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీకి బాధ్యతలు అప్పగించింది.

Instagram Features: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌త్యేక ఫీచ‌ర్స్‌.. తెలుసుకోండి.. ట్రై చేయండి

విద్యాసంస్థల్లో ఏది నకిలీది, ఏది ప్రభుత్వం గుర్తింపు పొందిన బోర్డు అనేది ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఈ పాఠశాలలు విద్యార్థులను మోసం చేస్తున్నాయి. ఈ పాఠశాలల్లో చేరి 10వ తరగతి, ఇంటర్ క్లియర్ చేయడానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ బోర్డులు రూ.10వేలు చెల్లిస్తే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన సర్టిఫికేట్ ఇస్తున్నట్లు ఇగ్నో నివేదికలో తెలిపింది. ఇలాంటి విద్యాసంస్థలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వదు. ఈ బోర్డులు సాధారణంగా పాఠశాలలతో అసోసియేట్ కావు. కానీ ఓపెన్ స్కూల్ ఆప్షన్ కోసం చూస్తున్న వ్యక్తులకు ఇండిపెండెంట్ స్కూల్ బోర్డులుగా రన్ అవుతున్నట్లు కనిపిస్తాయి.

నకిలీ స్కూల్ బోర్డుల్లో పనిచేస్తున్న ఉద్యోగి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఈ బోర్డులు ఏ పాఠశాలతోనూ సంబంధం లేకుండా రన్ అవుతాయని తెలిపారు. ఇవి స్వతంత్ర సంస్థలుగా ఏర్పడతాయని, ఇతర విద్యాసంస్థల మాదిరిగానే పరీక్షలు నిర్వహిస్తాయని చెప్పారు. చదువు మధ్యలోనే ఆపేసిన వారికి పదో తరగతి సర్టిఫికేట్ కావాల్సిన వారికి మరో అవకాశాన్ని ఈ విద్యాసంస్థలు కల్పిస్తున్నాయని చెప్పారు.

First published:

Tags: Career and Courses, Central Government, IGNOU

ఉత్తమ కథలు