నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(National Education Policy)- 2020 ప్రకారం దేశ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. విద్యా బోధనలో ప్రాంతీయ భాషలకు పెద్దపీట వేయడం నూతన విద్యా విధానంలో ముఖ్యమైన విషయం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఎంబీబీఎస్(MBBS) కోర్సులను ప్రాంతీయ భాషల్లో ఆఫర్ చేయాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో నర్సింగ్ ఫార్మసీ(Nursing Pharmacy), ఇంజనీరింగ్‌తో పాటు అనేక రకాల కోర్సులు ఇకపై ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని అనేక యూనివర్సిటీల్లో అకడమిక్ ఇయర్- 2024 నుంచి 12 వేర్వేరు భాషల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.
ప్రాంతీయ భాషల్లో విద్యా బోధన కోసం పాఠ్యపుస్తకాలను స్థానిక భాషల్లోకి అనువదించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. అకడమిక్ బుక్స్ ట్రాన్స్లేషన్ కోసం కేంద్ర విద్యాశాఖ ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ప్రముఖ విద్యావేత్త చాము కృష్ణ శాస్త్రి నేతృత్వం వహించనున్నారు. ఈ ప్రక్రియ రెండు దశల్లో సాగనుంది. మొదటి దశలో 1.5 నుంచి 2 ఏళ్ల పాటు సంబంధిత కోర్సు పుస్తకాలను12 భారతీయ భాషల్లోకి (హిందీ, బెంగాలీ, అస్సామీ, గుజరాతీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠీ, ఒడియా, ఉర్దూ, పంజాబీ) ట్రాన్స్లేషన్ చేయనున్నారు. ఇక, రెండో దశలో మరింత విస్తృతంగా కోర్సు మెటీరియల్‌ను 22 భారతీయ భాషలలోకి అనువదించడంపై దృష్టి సారించనున్నారు. దీంతో ఇక నుంచి తెలుగు భాషలో కూడా.. యూజీ, పీజీ కోర్సులు చేసేందుకు మార్గం సుగుమం అయింది.
యూనివర్సిటీలకు లేఖలు
పాఠ్యపుస్తకాల ట్రాన్స్లేషన్ విషయంపై దేశంలోని 200 యూనివర్సిటీలకు హై పవర్ కమిటీ ఇప్పటికే లేఖలు రాసిందని కృష్ణ శాస్త్రి తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, బీహార్ సెంట్రల్ యూనివర్సిటీ సహా ఇతర వర్సిటీలకు కమిటీ లెటర్స్ పంపించింది.
After Engineering n Medical now UG & PG Students will get option to learn in 12 different Regional languages from 2024 academic session. @AmarUjalaNews @narendramodi @PMOIndia @EduMinOfIndia @ugc_india @ChamuKShastry #University @NEP2020 #regionallanguages #ug #PG pic.twitter.com/mnv9qWNWGH
— Seema Sharma (@09seemasharma) October 18, 2022
ట్రాన్స్‌లేషన్‌లో CSTT నిపుణుల సహాయం
మేజర్ యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల ట్రాన్స్‌లేషన్‌ను ఉపాధ్యాయులు చేయనున్నారు. మరికొంతమంది ఇన్స్ట్రక్టర్స్ ప్రాంతీయ భాషలలో పాఠ్యపుస్తకాలను రాయడానికి బాధ్యత తీసుకోనున్నారు. ఇంకొంతమంది ట్రాన్స్లేషన్, కంటెంట్ క్రియేషన్‌పై దృష్టి సారించనున్నారు. ట్రాన్స్లేషన్ ప్రక్రియలో కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ (CSTT) నిపుణుల సహాయం కూడా తీసుకోనున్నారు. ఈ ప్రక్రియలో పాల్గొనే విద్యావేత్తల పేర్ల జాబితా ఇప్పటికే సిద్ధమైంది.
అమర్ ఉజాలా రిపోర్ట్ ప్రకారం.. యూనివర్సిటీలు ఇప్పటికే బీఏ, బీకామ్, బీఎస్సీ, లా వంటి మరెన్నో కోర్సుల పాఠ్యపుస్తకాలను ట్రాన్స్ లేట్ చేసే పనిని ప్రారంభించాయి. కొత్తగా ట్రాన్స్‌లేట్ చేసిన స్టడీ మెటీరియల్ 2024 అకడమిక్ సెషన్ నుంచి విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా ఉండాల్సిన కోర్సుల విషయంలో ఇటువంటి చర్య తిరోగమనానికి దారితీస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Degree posts, Indian, JOBS, Students