హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Team Lease EdTech: ఆన్‌లైన్ క్లాసులపై సర్వే.. టీచింగ్‌లో ప్రావీణ్యం లేని టీచర్లే ఎక్కువట.. ఎంత శాతం అంటే..

Team Lease EdTech: ఆన్‌లైన్ క్లాసులపై సర్వే.. టీచింగ్‌లో ప్రావీణ్యం లేని టీచర్లే ఎక్కువట.. ఎంత శాతం అంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కారణంగా విద్యా రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆన్‌లైన్ బోధనపై  ఓ ఎడ్‌టెక్ కంపెనీ ఇటీవల ఓ సర్వే చేపట్టింది. ఇప్పటికీ దాదాపు 30.58 శాతం మంది ఉపాధ్యాయులు డిజిటల్ సాధనాల వినియోగంలో ఎక్కువ ప్రావీణ్యం పొందలేదని సర్వేలో తేలింది.

ఇంకా చదవండి ...

కరోనా(Corona) మహమ్మారి కారణంగా విద్యా రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. తరగతి పాఠాలు ఆన్‌లైన్ మోడ్‌లోకి(Online Mode) మారాయి. గత రెండేళ్లలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఆన్‌లైన్ బోధనపై ఓ ఎడ్‌టెక్ కంపెనీ(EdTech Company) ఇటీవల ఓ సర్వే(Survey) చేపట్టింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రెండేళ్లుగా ఆన్‌లైన్ బోధనా(Online Teaching) ప్రక్రియ కొనసాగినా, ఇప్పటికీ దాదాపు 30.58 శాతం మంది ఉపాధ్యాయులు డిజిటల్ సాధనాల వినియోగంలో ఎక్కువ ప్రావీణ్యం పొందలేదని సర్వేలో తేలింది. ‘డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ది టీచింగ్ కమ్యూనిటీ’ పేరుతో ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ టీమ్‌లీజ్ ఇటీవల సర్వే చేపట్టింది.

వర్చువల్‌ క్లౌడ్‌ ల్యాబ్‌లను ఉపయోగిస్తున్న 14.88 శాతం మంది

సర్వే నివేదిక ప్రకారం.. ఉపాధ్యాయులలో 93.39 శాతం మంది వర్చువల్ క్లాస్‌రూమ్‌లను నిర్వహిస్తున్నారు. వీరిలో 50.41 శాతం మంది ఆన్‌లైన్ మూల్యాంకనాన్ని చేపడుతున్నారు. అలాగే 40.50 శాతం మంది కంటెంట్ ఆథరింగ్ సాధనాలను ఉపయోగిస్తున్నారు. మరోవైపు 31.40 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్ LMSని నిర్వహించగా, 14.88 శాతం మంది మాత్రమే వర్చువల్ క్లౌడ్ ల్యాబ్‌లను ఆపరేట్ చేయగలుగుతున్నారని సర్వే స్పష్టం చేసింది.

Cyber Crime: మీకు ప్రోగ్రామింగ్ లో మంచి ప్రావీణ్యం ఉందా..? అయితే రూ.6 లక్షలు మీవే..! వివరాలిలా..


ఆన్‌లైన్ బోధనకు అకస్మాత్తుగా మారినందున, మెజారిటీ ఉపాధ్యాయులు (79.34 శాతం) ప్రాక్టీస్ చేయడం ద్వారా నేర్చుకున్న విషయాన్ని నివేదిక హైలైట్ చేసింది. వీరిలో 35.54 శాతం మంది ఉపాధ్యాయులు విద్యాసంస్థలు అందించిన కోర్సుల ద్వారా ఆన్‌లైన్ బోధన‌పై అవగాహన పెంచుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయంతో 25.62 శాతం మంది, స్వీయ ప్రాయోజిత కోర్సుల ద్వారా19.01 శాతం మంది ఉపాధ్యాయులు ఆన్‌లైన్ బోధన కోసం తమను తాము సన్నద్ధం చేసుకున్నారు.

విద్యలో డిజిటల్ జోక్యంపై ఉపాధ్యాయుల మనోభావాలను కూడా నివేదిక పరిశోధించింది. గత రెండేళ్లలో నేర్చుకున్న సాంకేతిక బోధనా నైపుణ్యాలతో ప్రయోజనం ఉంటుందని 90.08 శాతం మంది ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. వీరిలో 66.94 శాతం మంది, ఈ కొత్త నైపుణ్యాలు తమ మెరుగైన కెరీర్ అవకాశాలను మరింత పెంచుతాయని వెల్లడించారు.

భవిష్యత్తులో వర్చువల్ క్లాస్‌రూమ్‌లలో డిజిటల్ సాధనాలను ఉపయోగించాలని 74.38 శాతం మంది ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. ఆన్‌లైన్ అసైన్‌మెంట్‌లకు 61.98 శాతం మంది, ప్రీ-రికార్డింగ్ కంటెంట్ కోసం 50.41 శాతం, ఆన్‌లైన్ పరీక్షల కోసం 39.67 మంది ఉపాధ్యాయులు డిజిటల్ సాధనాలను ఉపయోగించడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే 26.45 శాతం మంది ఉపాధ్యాయులు కూడా వర్చువల్ క్లౌడ్ ల్యాబ్‌లను ఉపయోగించాలనుకుంటున్నారు.

డిజిటల్ లెర్నింగ్ ద్వారా ఎదురయ్యే సవాళ్లను కూడా నివేదిక వెల్లడించింది. విద్యార్థులు ఆన్‌లైన్ తరగతుల సమయంలో పాఠాలపై ఆసక్తిని కోల్పోతారని 75.04 శాతం మంది అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. డిజిటల్ ఇంటిగ్రేషన్‌తో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇద్దరూ ఇప్పటికీ అసౌకర్యంగా ఉన్నారని 44.63 శాతం మంది ఉపాధ్యాయులు భావిస్తున్నారు.

మౌలిక సదుపాయాల కోణంలో 65.29 శాతం మంది ఉపాధ్యాయులు ఇంటర్నెట్ కనెక్టివిటీని సవాలుగా భావిస్తున్నారు. వారిలో 50.41 శాతం ఉపాధ్యాయులు.. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు/స్మార్ట్‌ఫోన్‌ల కొరత ఉందని భావిస్తున్నారు.

సర్వే ప్రకారం.. ఆన్ లైన్ బోధన విషయంలో 39.67% మంది ఉపాధ్యాయులు ఇప్పటికీ శిక్షణ సరిపోదని భావిస్తున్నారని, సమర్థవంతంగా బోధించడానికి వారికి మరింత నైపుణ్యం అవసరమని టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ సహ వ్యవస్థాపకుడు & ప్రెసిడెంట్ నీతి శర్మ అభిప్రాపడ్డారు.

First published:

Tags: Career and Courses, Digital, Online classes, Teaching

ఉత్తమ కథలు