పదోతరగతి (10th Class) విద్యార్థులకు ఎంతో కీలకమైంది. టెన్త్ క్లాస్ తర్వాత ఏ కోర్సు ఎంచుకుంటామనేదే.. చాలా ముఖ్యం. ఆ నిర్ణయం పూర్తిగా కెరీర్ మీద ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పదోతరగతి తర్వాత తమ పిల్లలను ఏ కోర్సులు చేర్పించాలి అని బాగా ఆలోచిస్తుంటారు. కెరీర్‌పై ప్రభావం చూపే ఈ నిర్ణయం విషయంలో ఎంతో జాగ్రత్త అవసరం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సరైన కోర్సుల్ని ఎంచుకుంటేనే కెరీర్ కూడా హ్యాపీగా సాగిపోతుంది. లేదంటే కెరీర్ (Career) గందరగోళంగా మారడం ఖాయం. మరి మీరు కూడా టెన్త్ తర్వాత ఏ కోర్సులు ఎంచుకోవాలి? కెరీర్ ఎలా తీర్చిదిద్దుకోవాలన్న డైలమాలో ఉన్నారా? అయితే ఈ కెరీర్ ఆప్షన్స్‌ని పరిశీలించండి.
టెన్త్ తర్వాత ఈ కోర్సులు ఎంచుకోవచ్చు
సైన్స్ స్ట్రీమ్: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ సబ్జెక్ట్స్‌తో కోర్సులు చేయొచ్చు.
ఇంటర్‌లో ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ (BiPc) లాంటి కోర్సులు ఉంటాయి. ఇంజనీరింగ్, వైద్య రంగం వైపు వెళ్లాలనుకునేవాళ్లు సైన్స్ కోర్సుల తర్వాత ఎంసెట్ (EAMCET), జేఈఈ, బిట్‌శాట్, నీట్ పరీక్షల ద్వారా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో (Medical College) సీట్లు పొందొచ్చు. మ్యాథ్స్, సైన్స్ ఇష్టమైతే ఈ కోర్సులు ఎంచుకోవచ్చు.
సైన్స్ కోర్సు వివరాలు..
MPC - మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
MBPC - మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ
BiPC - బయాలజీ(బాటనీ, జూవాలజీ), ఫిజిక్స్, కెమిస్ట్రీ
పలువురు విద్యార్థులు మ్యాథ్స్, సైన్స్ కంటే కామర్స్‌పై మక్కువ ఎక్కువగా ఉంటుంది. అలా ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇంటర్ (Inter)లోనే సీఈసీ కోర్సులుంటాయి. చార్టెర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, అకౌంటెంట్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ లాంటి కెరీర్ కోసం కామర్స్ కోర్సుల్ని ఎంచుకొనే అవకాశం ఉంది. కామర్స్‌లో ప్రధానంగా బిజినెస్ ఎకనామిక్స్ (Economics), అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీ, బిజినెస్ లా లాంటి సబ్డెక్ట్స్ ఉంటాయి. కామర్స్ ఇష్టమైతే ఈ కోర్సులు ఎంచుకోవచ్చు.
Govt Jobs 2022: ఈసీఐఎల్‌లో పదోతరగతి విద్యార్హతతో ఉద్యోగాలు.. వేతనం, అప్లికేషన్ విధానం
కామర్స్ ప్రధానంగా ఉన్న కోర్సులు..
CEC - సివిక్స్, ఎకనమిక్స్, కామర్స్
HEC - హిస్టరీ, ఎకనమిక్స్, సివిక్స్ లేదా కామర్స్
MEC - మ్యాథ్స్, ఎకనమిక్స్, కామర్స్
ఆర్ట్స్ కోర్సులు..
సైన్స్, కామర్స్ కాకుండా విద్యార్థులు ఎక్కువగా ఎంచుకొనే కోర్సు ఆర్ట్స్ గ్రూప్ కోర్సులు. ఈ గ్రూప్‌లో సైకాలజీ, పొలిటికల్ సైన్స్ (Political Science), ఫిలాసఫీ, హిస్టరీ, లిటరేచర్, సోషియాలజీ లాంటి సబ్జెక్ట్స్ ఇష్టమైతే ఆర్ట్స్ కోర్సులు ఉంటాయి. ఇవే కాకుండా జర్నలిజమ్, లిటరేచర్, సోషల్ వర్క్, టీచింగ్ ఫీల్డ్స్‌లో కెరీర్ తీర్చిదిద్దుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్, అరబిక్ లాంగ్వేజెస్ కోర్సులను విద్యార్థులు ఎంచుకోవచ్చు.
ఉపాధి ఇచ్చే కోర్సులు..
పదో తరగతి తర్వాత ఉపాధి అవకాశాలు త్వరగా సొంతం చేసుకోవాలి అంటే ఎంచుకోవాలంటే ప్రొఫెషనల్ కోర్సు (Course))ల్సి ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఆ కోర్సులు డిప్లొమా, వొకేషనల్, సర్టిఫికెట్ కోర్సులు ఉంటాయి. ఐటీఐలో ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్, ఫిట్టర్, మెకానిక్, టెక్నీషియన్ కోర్సులు చేయొచ్చు. పాలిటెక్నిక్ ద్వారా టెక్నికల్ కోర్సులు చేయొచ్చు.
టెక్నికల్ కోర్సుల వివరాలు..
డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్
డిప్లొమా ఇన్ గార్మెంట్ టెక్నాలజీ
డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ కోర్స్
డిప్లొమా ఇన్ ఇన్స్యూరెన్స్ అండ్ మార్కెటింగ్
టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్స్
ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్
హోటల్ ఆపరేషన్స్ కోర్స్
డెంటల్ టెక్నీషియన్ కోర్స్
ప్రస్తుత విద్యావ్యవస్థలో పదోతరగతి తరువాత ఎంచుకొనే కోర్సు కెరీర్‌పై ఎక్కు ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ ఇష్టాలను, ఉపాధి మార్గాలను తెలుసుకొని కోర్సు ఎంచుకోవడం ఉత్తమం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 10th class results, Career and Courses, EDUCATION, Intermediate, JOBS