Afghan students: ఇండియాకు అఫ్గాన్ విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు..అనుమతించాలంటూ అభ్యర్థనలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

కొందరు అఫ్గాన్ విద్యార్థులు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌లలో అడ్మిషన్లు పొంది ఆన్ లైన్ ద్వారా చదువు కుంటున్నారు. అయితే.. తాలిబన్ల కారణంగా అఫ్గానిస్థాన్‌ పరిస్థితి దిగజారడంతో అక్కడి నుంచి బయటపడేందుకు మార్గాలు వెతుకుతున్నారు.

  • Share this:
తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను వశపరచుకున్న తరువాత అక్కడి ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ ముష్కరుల ఆక్రమణతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దేశంలో సర్వత్ర ఉద్రిక్తత నెలకొనగా.. విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి మరింత ఆందోళన చెందుతున్నారు. కొందరు అఫ్గాన్ విద్యార్థులు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌లలో అడ్మిషన్లు సాధించి ఆన్ లైన్ ద్వారా చదువు కొనసాగిస్తున్నారు. అయితే తాలిబన్ల కారణంగా అఫ్గానిస్థాన్‌ పరిస్థితి మరింత దిగజారడంతో అక్కడి నుంచి బయటపడేందుకు మార్గాలు వెతుకుతున్నారు. తమకు త్వరగా వీసాలు అందించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. క్యాంపస్ హాస్టళ్లకు వచ్చేందుకు తమకు అనుమతి ఇవ్వాలని విద్యార్థులు భారత విద్యాసంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Imran Khan: అమెరికా మమ్మల్ని పావులా వాడుకుంది.. ఇమ్రాన్ ఖాన్ విమర్శలు.. అందులో మాత్రం ఇండియాకే ప్రాధాన్యత..
Afghanistan Crisis: అఫ్గాన్ విద్యార్థులకు ఐఐటీ బాంబే గుడ్ న్యూస్.. హాస్టళ్లలో చేరడానికి అనుమతి.. వివరాలివే

వివిధ సంస్థలు కూడా అఫ్గానిస్థాన్‌ విద్యార్థుల కోరిక మేరకు వీసాలకు సంబంధించిన పేపర్ వర్క్ త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ రాయబార కార్యాలయం వద్ద రద్దీ, విమాన రాకపోకల అనిశ్ఛితి తదితర కారణాల వల్ల విద్యార్థులు ఇప్పటికిప్పుడు ఇండియాకి రావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.

ఐఐటీ బాంబేలో చదువుతున్న విద్యార్థులు కూడా కొద్ది రోజులుగా ఆన్‌లైన్ క్లాసులుకు హాజరవుతున్నారు. తమ విద్యార్థుల అభ్యర్థనను అంగీకరించి క్యాంపస్ కి తిరిగి వచ్చేందుకు అనుమతి ఇచ్చామని ఐఐటీ బాంబే డైరెక్టర్ శుభశిష్ చౌదరి చెప్పారు. ఐఐటీ ఢిల్లీలోనూ కొందరు అఫ్గానిస్థాన్‌ స్టూడెంట్స్ చదువుతున్నారు. వీరికి త్వరితగతిన వీసాలు జారీ చేసేందుకు ముంబయి కార్యాలయం.. కాబూల్‌లోని ఇండియా రాయబార కార్యాలయంతో కలిసి పని చేస్తోంది.

ఐఐటీ ఢిల్లీలో 17 మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో ఒక్కరు కూడా ఇండియాకి రాలేదని.. ముగ్గురు విద్యార్థులు త్వరలోనే ఇండియాకి చేరుకుంటామని చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు వీసా పొందినప్పటికీ విమాన సేవలు అందుబాటులో లేకపోతే భారత్ కి రావడం అసాధ్యమని ఓ ఐఐటీ ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) స్కాలర్ షిప్ ప్రోగ్రామ్స్ కింద ఉన్నత చదువులు చదవడానికి అఫ్గానిస్థాన్‌ స్టూడెంట్లు ప్రతియేటా ఇండియాకి వస్తున్నారు. మరోవైపు ఇండియాలో ఉన్న అఫ్గాన్ విద్యార్థులు తమ వీసా గడువు పెంచాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Published by:Nikhil Kumar S
First published: