AEGON LIFE INSURANCE ALLOW THEIR EMPLOYEES TO WORK FROM ANYWHERE FROM TODAY SS GH
Work from Anywhere: ఇక ఆ కంపెనీ ఉద్యోగులు ఎక్కడి నుంచైనా పనిచేయొచ్చు
Work from Anywhere: ఇక ఆ కంపెనీ ఉద్యోగులు ఎక్కడి నుంచైనా పనిచేయొచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)
Work from Anywhere | వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అందరికీ తెలుసు. కరోనా సంక్షోభకాలంలో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది.
కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో ఉపాధి రంగం ఒకటి. ఇది ఉద్యోగుల పని స్వభావాన్నే పూర్తిగా మార్చేసి.. వర్క్ ఫ్రం హోమ్ అనే కొత్త కల్చర్‌ను ఉద్యోగులకు పరిచయం చేసింది. అంతకుముందు ఎప్పుడూ ఇంటి నుంచి పని చేసే విధానాన్ని అమలు చేయని సంస్థలు సైతం కరోనా కారణంగా అటువైపు అడుగులు వేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం తగ్గి, లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్నే కొనసాగిస్తున్నాయి. తాజాగా, ప్రముఖ బీమా సంస్థ ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ తమ ఉద్యోగుల సౌకర్యార్థం కొత్త పాలసీని తీసుకొచ్చింది. 2021 ఏప్రిల్ 1 నుంచి తమ సంస్థ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ ఎనీవేర్’ అనే ఒక కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. కాగా, భారత్‌లో వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ విధానాన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి ఇన్సూరెన్స్ కంపెనీ ఇదే కావడం విశేషం.
ఈ కొత్త పని విధానంతో పాటు కోర్ వర్కింగ్ అనే కొత్త కాన్సప్ట్‌ను కూడా ఉద్యోగులకు పరిచయం చేస్తోంది. దీని ప్రకారం, సంస్థ మేనేజర్లు తమ బృందాలతో నిర్దిష్ట సమయాల్లో ఈ–మీటింగ్స్, కాన్ఫరెన్స్ కాల్స్‌ను నిర్వహించుకోవచ్చు. తద్వారా, తక్కువ సమయంలో ఎక్కువ అవుట్‌పుట్‌ను తీసుకురావచ్చని కంపెనీ భావిస్తోంది. అంతేకాక, ఈ విధానంతో ఉద్యోగులకు తక్కువ పని గంటలు అమలు చేయడం ద్వారా, సులభంగా వారు వర్క్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఫలితంగా, పనిపై శ్రద్ధ పెడతారని కంపెనీ యోచిస్తోంది.
ఈ నూతన విధానంపై ఏగాన్ లైఫ్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ సునీతా రాత్ మాట్లాడుతూ "ఉద్యోగులతో సులభంగా కనెక్ట్ అవ్వడానికి, వారి వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్‌ను బ్యాలన్స్ చేసుకోవడానికి ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం." అని అన్నారు. కాగా, గ్రాంట్ తోర్న్ టాన్ వంటి సంస్థలు కూడా ఇటీవలి కాలంలో తమ సిబ్బంది కోసం వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పాలసీని ప్రకటించాయి. తద్వారా, ఉద్యోగుల అవుట్‌పుట్ పెరుగుతుందని ఆశిస్తున్నాయి. ఈ వర్క్ ఫ్రం ఎనీవేర్ (WFA) విధానంలో భాగంగా ఒక ఉద్యోగి తన ఇంటి నుండైనా లేదా భారతదేశంలోని ఏ ప్రదేశం నుండైనా పని చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో దాదాపు అన్ని ఐటీ ఆధారిత కంపెనీలు తమ ఉద్యోగులకు రిమోట్ వర్కింగ్ ఆప్షన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో COVID-19 టీకా డ్రైవ్ కొనసాగుతుండటం, కరోనా తీవ్రత తగ్గడంతో కొన్ని సంస్థలు హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను కూడా అవలంబిస్తున్నాయి. దీని ద్వారా వారంలో ఉద్యోగులు కొన్ని రోజులు ఇంటి నుండి పని చేయవచ్చు లేదా కొన్ని రోజులు కార్యాలయానికి వచ్చి పని చేసుకునే అవకాశం లభిస్తుంది. వారికి ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ పనిచేసుకోవచ్చు. తద్వారా ఉత్పాదకత పెరుగుతుందని కంపెనీలు యోచిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ తో పాటు కంపెనీ ప్రతి నెలా రెండో బుధవారం ‘నో మీటింగ్స్ డే’ ను అమలు చేస్తోంది. ఆ రోజు ఎటువంటి ప్రీ షెడ్యూల్ కాల్స్, మీటింగ్స్ ఉండవు. తద్వారా, ఉద్యోగి ఎటువంటి అవాంతరాలు లేకుండా, తమ ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు దోహదం చేస్తోంది. ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని పెంపోందించేందుకు మా కంపెనీ రెగ్యులర్ ఆన్లైన్ వెల్నెస్ సెషన్లను కూడా నిర్వహిస్తోందని ఏగాన్ లైఫ్ తెలిపింది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.