దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు అడ్మిషన్స్(Admissions) కోసం స్పెషల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంటాయి. ముఖ్యంగా టాప్ డీమ్డ్, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్(Engineering Admissions) కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. తాజాగా తమిళనాడు కేంద్రంగా పనిచేసే అమృత విశ్వ విద్యాపీఠం, అమృత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AEEE)- 2023 తేదీలను ప్రకటించింది.
అమృత విశ్వ విద్యాపీఠం ఒక డీమ్డ్ యూనివర్సిటీ. NIRF ర్యాంకింగ్స్‌లో ఈ ఇన్‌స్టిట్యూట్ దేశంలో 5వ స్థానంలో ఉంది. ఈ సంస్థ నిర్వహించే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2022 నవంబర్ 18న ప్రారంభమైంది. AEEE- 2023 లేదా JEE మెయిన్ 2023లో పొందిన ర్యాంక్ ఆధారంగా అమృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ - అమృతపురి, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, అమరావతి క్యాంపస్‌లలో B.Tech ప్రోగ్రామ్స్‌కు అడ్మిషన్ కేటాయిస్తుంది.
రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్
AEEE 2023 అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. ఆసక్తి ఉన్నవారు amrita.edu అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. AEEE- 2023 ఎగ్జామ్ రెండు సెషన్లలో జరగనుంది. ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 21-28 మధ్య జరగనుండగా, సెకండ్ ఫేజ్ సెషన్ మే 5 నుంచి మే 11 వరకు కొనసాగనుంది.
అమృత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్- 2023.. దేశంలోని 140 నగరాలతో పాటు ఇతర దేశాల్లోని కొన్ని నగరాల్లో కూడా జరగనుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. AEEE- 2023 వ్యవధి 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు AEEE- 2023 ర్యాంక్, JEE మెయిన్- 2023 పర్సంటైల్ రెండింట్లో టాప్ ప్లేస్‌లో ఉంటే.. స్కాలర్‌షిప్ ఆప్షన్‌తో టాప్ బ్రాంచ్‌లో అడ్మిషన్ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇలా అప్లై చేసుకోండి..
అమృత విశ్వ విద్యాపీఠంలో బీటెక్ చేయాలనుకునే అభ్యర్థులు ముందు అడ్మిషన్స్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఈ ప్రక్రియలో విద్యార్థులు ముందు అమృత ఆన్‌లైన్ అడ్మిషన్ పోర్టల్ (AOAP) అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేయండి.
ఇప్పుడు అప్లికేషన్ ఫారమ్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీంట్లో మీ వ్యక్తిగత సమాచారంతో పాటు అవసరమైన అన్ని వివరాలు నింపాలి. AEEE- 2023 లేదా JEE మెయిన్ స్కోర్- 2023 రెండింట్లో దేని సాయంతో సీటు ఆశిస్తున్నారనే అడ్మిషన్ మోడ్‌ను సెలక్ట్ చేయండి.
తర్వాత ఎగ్జామ్ సెంటర్ ప్రయారిటీ లిస్ట్‌ను ఎంచుకోండి. ఇప్పుడు అప్లికేషన్‌ను క్రాస్ చెక్ చేసి, ఎగ్జామ్ ఫీజు చెల్లించండి. అభ్యర్థులు AEEE ఎగ్జామ్ కోసం రూ. 1,200 ఫీజు చెల్లించాలి. ఏఈఈఈ+జేఈఈకి దరఖాస్తు చేసుకునే వారు రూ. 1,200తో పాటు రూ. 500 స్పెషల్ ఫీజు చెల్లించాలి.
ఫీజు చెల్లించిన తర్వాత ఫారమ్‌ను సబ్‌మిట్ చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని స్క్రీన్‌షాట్ లేదా ప్రింటవుట్ తీసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Engineering, Entrance exams, JOBS