సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CTET పరీక్ష యొక్క రీషెడ్యూల్డ్ పరీక్షల కోసం అడ్మిట్ కార్డ్‌లను జారీ చేసింది. రద్దయిన సీటీఈటీ పరీక్షల అడ్మిట్ కార్డులు ఇప్పుడు విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు హాజరు కాబోయే అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అధికారిక వెబ్‌సైట్ నుండి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని కొరకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2023 యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ctet.nic.in సందర్శించాలి. 2023 జనవరి 11, 18 మరియు 24 తేదీల్లో జరగాల్సిన CBSE CTET పరీక్షలు కొన్ని కారణాల వల్ల పలు సెంటర్లలో రద్దు అయ్యాయి. ఈ పరీక్షలు మళ్లీ నిర్వహించనున్నారు. ఇందుకోసం మరోసారి అడ్మిట్ కార్డులు జారీ చేశారు. CTET పరీక్ష రద్దు చేయబడిన అభ్యర్థులు రీషెడ్యూల్ చేసిన పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌ని మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ పరీక్షకు సంబంధించి.. పరీక్ష రద్దు చేయబడిన అభ్యర్థులు అంటే పరీక్ష నిర్వహించలేని పరీక్షా కేంద్రాలు, ఆ అభ్యర్థులకు పరీక్షను రాయడానికి ఇదే చివరి అవకాశం అని బోర్డు స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత వారికి పరీక్షకు హాజరయ్యేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వరు. రద్దు చేసిన పరీక్షకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదని బోర్డు తెలియజేసింది. ఈ సీటెట్ పరీక్ష షెడ్యూల్ ఫిబ్రవరి 07, 2023 వరకు ఉన్నాయి.
అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోండిలా..
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ముందుగా అధికారిక వెబ్‌సైట్ అంటే ctet.nic.in ని సందర్శించండి.
-ఇక్కడ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్ హోమ్‌పేజీలో ఇవ్వబడుతుంది. దానిపై క్లిక్ చేయండి.
-ఇలా చేయడం వల్ల కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీ అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి.
-వివరాలను నమోదు చేసి, సమర్పించు బటన్‌ను క్లిక్చేయండి. ఇలా చేయడం ద్వారా.. మీ అడ్మిట్ కార్డ్ కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
-డౌన్ లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి.. మీ అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
CTET డిసెంబర్ - జనవరి పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మొదటి షిప్టు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. 1 నుండి 8వ తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులు పేపర్ 1 ఇస్తారు. 6 నుండి 8వ తరగతి విద్యార్థులకు బోధించాలనుకునే వారికి పేపర్ 2 ఇవ్వబడుతుంది. రెండు పేపర్స్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒకే రోజు రెండు షిప్ట్ లల్లో పరీక్ష ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Admit cards, Career and Courses, Ctet, JOBS